2026 వ సంవత్సరం మే 31 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 134 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం
March 03rd, 04:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.