గ్రాండ్‌మాస్టర్‌గా దివ్యా దేశ్‌ముఖ్…. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
July 29th, 06:00 am
దివ్యా దేశ్‌ముఖ్ ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్-2025ను గెలుచుకోవడం ఒక్కటే కాకుండా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా నిలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. ‘‘ఆమె సాధించిన విజయం ఎంతో మందికి ప్రేరణను ఇవ్వడంతో పాటు చదరంగ క్రీడ మన యువతలో ఇప్పటికన్నా మరింత ఎక్కువ ఆదరణ పొందడానికి తోడ్పడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌కు ప్రధాని అభినందన
July 28th, 06:29 pm
ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. “కోనేరు హంపి కూడా ఛాంపియన్‌షిప్‌లో అపార ప్రతిభ కనబరిచారు. భవిష్యత్ ప్రయత్నాల దిశగా వారిద్దరికీ శుభాకాంక్షలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.లండన్‌లో వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్.. బ్లిట్జ్ సెమీ ఫైనల్‌లో దివ్యా దేశ్‌ముఖ్ అద్భుత విజయం.. ప్రధానమంత్రి అభినందనలు
June 19th, 02:00 pm
లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌పై చారిత్రక గెలుపును సాధించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.