BRICS New Delhi Declaration: Building for Resilience, Innovation, Cooperation and Sustainability

September 12th, 06:11 pm

The BRICS New Delhi Declaration 2026 sets out a shared commitment to stronger cooperation, inclusive global governance, sustainable development, innovation and resilience. Adopted at the 18th BRICS Summit in New Delhi, the declaration reflects the priorities and outcomes of India’s BRICS Chairship.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 15th, 07:00 am

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం

August 15th, 06:50 am

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది

August 15th, 06:45 am

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శక్తి, సంకల్పంతో 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే కల గురించి మాట్లాడారు. శాంతి చట్టం, రైల్వే విద్యుదీకరణ, భారతదేశ వాణిజ్య ఒప్పందాలు, నక్సలిజం అంతం వంటి కీలకమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'శక్తి కీ సప్తధార'ను స్వీకరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

స్థానిక ఎంపీలతో కలిసి ఒరిస్సా వరద పరిస్థితిని సమీక్షించిన ప్రధానమంత్రి

July 28th, 02:12 pm

అస్సాంలోని పలు ప్రాంతాల్లో.. వరద పరిస్థితిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ఆ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమై చర్చించారు.

ఆస్ట్రేలియాలో భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

July 09th, 03:22 pm

మనం సమావేశమైన ఈ నేల పరంపరానుగత యజమానులకు గౌరవాభివాదాలతో నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. వారి పూర్వీకులకూ, పెద్దలకూ వినమ్రపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను. నవతరానికి శుభాకాంక్షలు.

ఆస్ట్రేలియాలోని భారతీయులతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 09th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మెల్బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోగల భారతీయులతో నిర్వహించిన భారీ సభలో వారినుద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్ కూడా గౌరవపూర్వకంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు

July 07th, 02:51 pm

నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

ఒప్పందాల జాబితా: ఇండోనేషియాలో ప్రధానమంత్రి పర్యటన

July 07th, 01:03 pm

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో సహకారంపై విధానపరమైన ఒప్పందం పొడిగింపు

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

July 07th, 11:21 am

మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి

February 14th, 07:29 pm

అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని (ఈఎల్ఎఫ్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతానికి అత్యవసర ల్యాండింగ్ సదుపాయం లభించడం అపారమైన గర్వకారణమని అన్నారు. వ్యూహాత్మక దృక్పథంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఇది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 13th, 11:38 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటిస్తారు. ఉదయం సుమారు 10:30 గంటల వేళలో, ప్రధానమంత్రి డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)లో విమానం నుంచి నేల మీదికి దిగుతారు. అక్కడ పోరాట విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాల్ని ఆయన వీక్షిస్తారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తి అయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట వేళలో ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత, గువాహాటీలోని లచిత్ ఘాట్‌ వద్ద వివిధ పథకాలను మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాలకు రూ.5,450 కోట్లకు పైగా మొత్తాన్ని ఖర్చు చేశారు.

2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా

January 27th, 06:48 pm

2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన

January 27th, 06:15 pm

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుల భారత పర్యటన: ముఖ్య నిర్ణయాలు

January 27th, 02:53 pm

2030 దిశగా: భారత్‌- యూరోపియన్ యూనియన్ ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక కార్యాచరణ

రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్‌ జనరళ్లు.. ఇన్స్‌పెక్టర్‌ జనరళ్ల సదస్సు

November 30th, 05:17 pm

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్‌ జనరళ్లు-ఇన్స్పెక్టర్‌ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్‌: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్‌ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

నవంబరు 29-30 తేదీల్లో రాయ్‌పూర్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్స్/ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సదస్సులో పాల్గొననున్న ప్రధాని

November 27th, 12:45 pm

నవంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. పోలీసు శాఖకు సంబంధించి కీలక సవాళ్ళ పరిష్కారంలో ఇంతవరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ‘వికసిత్ భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

Critical minerals are a shared resource of humanity: PM Modi at G20 Johannesburg Summit Session - 2

November 22nd, 09:57 pm

In his statement during the G20 Summit Session - 2 in Johannesburg, South Africa, PM Modi touched upon important topics like critical minerals, natural disasters, space technology and clean energy. The PM highlighted that India is promoting millets. He also said that the G20 must promote comprehensive strategies that link nutrition, public health, sustainable agriculture and disaster preparedness to build a strong global security framework.

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం

November 19th, 11:00 am

పవిత్రమైన పుట్టపర్తి నేలపై నేడు మీ అందరి మధ్య ఉండటం నాకు ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి. కొద్దిసేపటి క్రితం బాబా సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందడం ఎల్లప్పుడూ నా హృదయాన్ని భావోద్వేగంతో నింపే అనుభవం.

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

November 19th, 10:30 am

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా భక్తకోటిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘సాయిరాం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి.. ఈ పవిత్ర పుట్టపర్తి క్షేత్రంలో భక్తులందరి నడుమ ఉండడం ఒక భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే బాబా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించే అవకాశం తనకు దక్కిందన్నారు. బాబా పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను పొందినట్లు చెప్పారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు అందించినా మనసు భావోద్వేగానికి లోనవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.