Cabinet approves continuation of the PM-KISAN Scheme from 2026-27 to 2030-31 with a Financial Outlay of Rs.3.15 lakh crore
July 31st, 04:13 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the continuation of the PM-KISAN Scheme with an outlay of ₹3.15 lakh crore for 2026–31. The scheme will continue providing direct income support to eligible farmers, strengthening agricultural investment and rural prosperity.India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.గరీబ్ కళ్యాణ్, ప్రజల సాధికారతే ధ్యేయంగా12 ఏళ్ల విప్లవాత్మక కార్యక్రమాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి
June 08th, 10:24 am
గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులన్నింటికీ మూలాధారమని స్పష్టం చేశారు. అంత్యోదయ ఆశయంతో మన ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందని, దశాబ్దాలుగా వెనకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ ప్రయత్నమని ప్రధానమంత్రి తెలిపారు.సేవా సంకల్ప ప్రతిపాదన
February 24th, 04:53 pm
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘సేవా తీర్థ్’లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గ మొదటి సమావేశం జరుగుతుంది.యువత పురోగతికి ఉద్దేశించిన వేర్వేరు కార్యక్రమాలను అక్టోబరు 4న ప్రకటించనున్న ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమాల విలువ రూ.62,000 కోట్లు
October 03rd, 03:54 pm
యువజనాభివృద్ధికి అండగా నిలిచే ఒక మహత్తర కార్యక్రమానికి నాందీప్రస్తావన జరగబోతోంది.. యువత పురోగతిపై దృష్టి సారించి రూ.62,000 కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఖర్చు పెట్టే వివిధ కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమాలు దేశం నలుమూలలా విద్య బోధన, నైపుణ్య సాధనకు దోహదపడడంతో పాటు, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయాలన్న తపనకు కూడా అండగా నిలుస్తాయి. ఇదే కార్యక్రమంలో, నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ నాలుగో సంచిక ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ను కూడా నిర్వహిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించారు. దీనిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ ఆధీనంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో అఖిల భారత్ స్థాయి అగ్రగాములుగా నిలిచిన 46 మందిని సత్కరిస్తారు.బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
September 25th, 06:44 pm
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ను సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి బీహార్ వ్యాప్తంగా 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
July 01st, 03:04 pm
తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రంగాల్లో ఉపాధి కల్పనకు మద్దతునివ్వడానికి, ఉపాధి అవకాశాలను, సామాజిక భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు ఒక నెల వేతనం (రూ. 15,000/- వరకు) ప్రోత్సాహకంగా పొందుతారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా అన్ని రంగాల్లోని యాజమాన్యాలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలను అందించనున్నారు. తయారీ రంగానికి చెందిన యాజమాన్యాలకు మరో రెండేళ్లు అదనంగా ఈ ప్రయోజనాలు కల్పించనున్నారు. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను సులభతరం చేయడం కోసం ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీలో భాగంగా రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయంతో 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు.టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.Our government places utmost importance on 'Samman' and 'Suvidha' for women: PM Modi in Navsari, Gujarat
March 08th, 11:50 am
PM Modi launched various developmental works in Navsari, Gujarat and addressed the gathering on the occasion of International Women's Day. PM extended his best wishes to all the women of the country and remarked that women are excelling in every sector. He highlighted the launch of two schemes, G-SAFAL and G-MAITRI in Gujarat. Shri Modi acknowledged Navsari district as one of the leading districts in Gujarat for rainwater harvesting and water conservation. He spoke about Namo Drone Didi campaign that is revolutionizing agriculture and the rural economy.గుజరాత్‌లోని నవ్‌సారిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 11:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని నవ్‌సారిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహా కుంభమేళాలో గంగా మాత ఆశీస్సులు పొందానని, ఈ రోజు మాతృశక్తి మహా కుంభమేళాలో ఆశీర్వాదం పొందానని ఆయన తెలిపారు. ఈ రోజు గుజరాత్‌లో జీ-సఫాల్ (జీవనోపాధిని పెంపొందించడానికి అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జీ-మైత్రి (గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలకు గుజరాత్ అందించే మెంటార్‌షిప్ అండ్ యాక్సిలరేషన్) అనే రెండు పథకాలను ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వివిధ పథకాల నిధులను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశామని, ఈ విషయంలో ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం
March 06th, 08:05 pm
మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.PM Modi addresses Republic Plenary Summit 2025
March 06th, 08:00 pm
PM Modi addressed the Republic Plenary Summit in Delhi. Shri Modi highlighted that the world is now recognising this century as India's century and the country's achievements and successes have sparked new hope globally. He stated that India, once perceived as a nation that would sink itself and others, is now driving global growth.Politics is about winning people's hearts, says PM Modi in podcast with Nikhil Kamath
January 10th, 02:15 pm
Prime Minister Narendra Modi engages in a deep and insightful conversation with entrepreneur and investor Nikhil Kamath. In this discussion, they explore India's remarkable growth journey, PM Modi's personal life story, the challenges he has faced, his successes and the crucial role of youth in shaping the future of politics.పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
January 10th, 02:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గుజరాత్‌లోని వద్‌నగర్ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.