నవ రాయ్‌పూర్‌లోని సత్యసాయి సంజీవని పిల్లల గుండెజబ్బు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న బాలలతో ప్రధానమంత్రి మాటామంతీ

November 01st, 05:30 pm

సర్‌... నేను హాకీ ఛాంపియన్‌ని. ఇప్పటిదాకా 5 పతకాలు సాధించాను. మా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించినపుడు నా గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధరించారు. ఆ తర్వాత ఈ ఆస్పత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నాను. నేనిప్పుడు మళ్లీ హాకీ మైదానంలో ప్రతిభ చూపగలను.

పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులను జయించిన పిల్లలతో ప్రధానమంత్రి ముఖాముఖి

November 01st, 05:15 pm

'దిల్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో జరిగిన ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల నుంచి విజయవంతంగా కోలుకున్న 2500 మంది పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు.