న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

July 11th, 01:15 pm

‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.

న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

July 11th, 12:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

July 07th, 11:21 am

మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

మెరుగైన పాలన, పౌరులకు సాధికారతతోపాటు వికసిత్ భారత్‌కు బలమైన పునాదిని అందించిన డిజిటల్ ఇండియా: ప్రధాని నరేంద్ర మోదీ

July 01st, 12:04 pm

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై విజయవంతంగా 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం దేశంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చివేసిందని, ప్రజా సేవల్ని మెరుగుపరిచి పౌరుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని ఆయన కొనియాడారు.

సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:30 pm

2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ ‌హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.

ఒప్పందాల జాబితా: సీషెల్స్‌‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:17 pm

సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ నౌక బహుమతి

సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 05:00 pm

ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.

ప్రధానమంత్రితో నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా సమావేశం

June 25th, 10:40 pm

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ద్రవ్య వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానమంత్రి వివరిస్తూ- “దేశమంతటా చౌకగా, విస్తృతంగా ఆర్థిక సేవల ప్రదానంలో భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం తోడ్పాటు సహా ఇతరత్రా అంశాలపై మేం చర్చించాం” అని పేర్కొన్నారు. ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

June 15th, 05:17 pm

కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

India and Slovakia are moving forward in close coordination on the global stage: PM Modi at the India-Slovakia Joint Press Meet

June 15th, 03:00 pm

At the joint press meet in Bratislava, PM Modi and Slovak Prime Minister Robert Fico announced the elevation of India-Slovakia ties to a Comprehensive Partnership. PM Modi highlighted growing cooperation in trade, technology, defence, space, digital innovation and mobility, saying the upgraded partnership reflects shared priorities, shared trust and a shared vision for the future.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతమైన వేగంతో పురోగమిస్తున్నాయన్న ప్రధానమంత్రి

June 05th, 05:10 pm

భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. భారత్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా ఆయన అన్నారు.

రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 23rd, 11:15 am

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 23rd, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్‌ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన

May 20th, 10:28 pm

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన

May 18th, 04:44 pm

గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నెక్ట్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 10:47 pm

ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.