ఆవిష్కరణలపై భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక ప్రణాళిక-2030
June 15th, 05:42 am
భారత్-ఫ్రాన్స్ స్నేహ బంధాన్ని 2026 ఫిబ్రవరి 17న “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త మలుపు తిప్పారు. అలాగే, ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణలు, పరిశోధన, సాంకేతికత, డిజిటల్ రంగం, సైబర్ రంగం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్యా సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం, వైవిధ్యభరితంగా రూపుదిద్దాలని వారిద్దరూ నిర్ణయించారు.ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.పదేళ్ల డిజిటల్ ఇండియా ప్రస్థానానికి ప్రధాని ప్రశంసలు
July 01st, 09:40 am
విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దశాబ్దం తర్వాత ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన, నవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించింది.’’ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)
November 20th, 09:55 pm
హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందంభారతదేశపు అగ్రశ్రేణి ఆటగాళ్ళు ‘కూల్’ ప్రధాని మోదీని కలిశారు
April 13th, 12:33 pm
పిసి మరియు విఆర్ గేమింగ్ ప్రపంచంలో లీనమై, భారతదేశంలోని అగ్రశ్రేణి గేమర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన పరస్పర చర్యలో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధాని మోదీ గేమింగ్ సెషన్‌లలో చురుకుగా పాల్గొన్నారు, వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమ పట్ల తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.