Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatచండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 17th, 02:08 pm
చండీగఢ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అది దేశ ప్రగతికి ఒక అద్భుతమైన నమూనా. క్రమబద్ధమైన అభివృద్ధి, మెరుగైన జీవన విధానం, సులభతర జీవనానికి ఈ నగరం పేరుగాంచింది. ఇక్కడి అత్యుత్తమ వైద్య సదుపాయాలు, అన్నింటికంటే ముఖ్యంగా చండీ మాత ఆశీస్సులు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అందుకే చండీగఢ్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు ఏడాదిన్నర క్రితం మన దేశ న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణను తీసుకువచ్చాం. కేవలం శిక్షించడమే లక్ష్యంగా ఉన్న పాత శిక్షాస్మృతి స్థానంలో, న్యాయం అందించడమే పరమావధిగా ఉండే భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టాం. ఈ చారిత్రక చట్టాల అమలు ప్రక్రియను మన చండీగఢ్ నుంచే ప్రారంభించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది.చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ.. విద్య.. రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 17th, 01:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. క్రమబద్ధ జాతీయ ప్రగతికి ఈ నగరం ఒక ఆదర్శప్రాయ నమూనాగా నిలుస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశంలో దీనికిగల ప్రత్యేక స్థానాన్ని ప్రస్తావిస్తూనే- మెరుగైన జీవనశైలితో పాటు జీవన సౌలభ్య కల్పనలో నగరానికిగల ప్రాచుర్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంపై చండీమాత కృప మెండుగా ఉందంటూ- దీని నిరంతర, వ్యవస్థీకృత ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వం చండీగఢ్ ప్రగతికి సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
June 19th, 05:00 pm
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతమైన వేగంతో పురోగమిస్తున్నాయన్న ప్రధానమంత్రి
June 05th, 05:10 pm
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. భారత్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా ఆయన అన్నారు.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.భారత్‌లో కొరియా రిపబ్లిక్ అధ్యక్షుని అధికారిక పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
April 20th, 03:57 pm
భారత్-కొరియా రిపబ్లిక్ (ఆర్ఓకే) ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త వ్యూహాత్మక దృష్టి కోణం.భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా ఒప్పందాలు, ప్రకటనలు
February 08th, 11:05 am
భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో - విజువల్ సహనిర్మాణ ఒప్పందంమలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన
February 08th, 08:35 am
ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన
February 08th, 08:30 am
మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేషియాలోని కౌలాలంపూర్‌కు అధికారిక పర్యటన
February 04th, 04:17 pm
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి మోదీ 2026 ఫిబ్రవరి 7 నుండి 8 వరకు మలేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మలేషియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షిస్తారు. ఆయన భారతీయ సమాజ సభ్యులతో పాటు పరిశ్రమ మరియు వ్యాపార ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు మరియు 10వ భారతదేశం-మలేషియా సీఈఓ ఫోరంలో పాల్గొంటారు.అనువాదం: ఒమన్‌లోని భారతీయ సమాజం, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
December 18th, 12:32 pm
మీ యువ ఉత్సాహం, శక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయి. ఈ హాల్ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్‌లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్‌లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.ఒమన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
December 18th, 12:31 pm
మస్కట్‌లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్‌లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోని కుటుంబాలు, మిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా, వర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్‌లో స్థిరపడిన భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. వైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీ, భారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒమన్‌లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనం, సహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం
December 17th, 12:25 pm
పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని
December 17th, 12:12 pm
భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.