ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 10th, 01:30 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...కర్ణాటకలోని బెంగళూరు లో సుమారు రూ.22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం...శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
August 10th, 01:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు.కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
December 21st, 06:34 pm
నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 21st, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
September 22nd, 10:00 pm
నమస్తే అమెరికా! ఇప్పుడు మన నమస్తే కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.న్యూయార్క్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
September 22nd, 09:30 pm
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి సోమవారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15,000 మంది ప్రజలు హాజరయ్యారు.రోజ్ గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
September 26th, 11:04 am
నేటి రోజ్ గార్ మేళాలో ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలు అందుకుంటున్న అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో కఠిన శ్రమ అనంతరం మీరందరూ ఈ విజయం సాధించారు. లక్షలాది మంది పోటీదారులను ఎదుర్కొని మీరు ఈ విజయం సాధించినందున మీ జీవితంలో ఇది అత్యంత ప్రత్యేకమైనది.రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
September 26th, 10:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోజ్‌గార్ మేళాలో ప్రసంగించారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో చేరారు. అవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరిగింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 23rd, 08:54 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి
May 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
May 11th, 11:00 am
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గం లోని నా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనిటీ కి చెందిన గౌరవనీయ సభ్యులు, నా యువ సహచరులు! ఈ రోజు భారతదేశ చరిత్రలో గర్వించదగిన రోజులలో ఒకటి. భారతమాత ప్రతి బిడ్డ గర్వపడేలా చేసిన పోఖ్రాన్ లో భారత శాస్త్రవేత్తలు ఇలాంటి ఘనతను సాధించారు. అటల్ జీ భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను ప్రకటించిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. భారత్ తన శాస్త్రీయ నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా, పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా భారత్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి కొత్త ఎత్తుకు చేర్చింది. అటల్ గారి మాటలను నేను ఉదహరిస్తున్నాను, మేము మా మిషన్ లో ఎప్పుడూ ఆగిపోలేదు, ఏ సవాలు ముందు తలవంచలేదు. దేశ ప్రజలందరికీ జాతీయ సాంకేతిక దినోత్సవ శుభాకాంక్షలు.నేషనల్ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా మే 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
May 11th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రగత మైదాన్ లో నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023ను పురస్కరించుకుని నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11 నుంచి 14వ తేదీల మధ్య జరిగే నేషనల్ టెక్నాలజీ దినోత్సవం రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ శాస్ర్త, సాంకేతిక పురోగమనానికి దోహదపడే రూ.5800 కోట్లకు పైబడిన విలువ గల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. దేశంలోని శాస్ర్తీయ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.డిజిలాకర్‌తో ఖేలో ఇండియా సర్టిఫికెట్ల సంధానంపై ప్రధాని హర్షం
April 08th, 11:30 am
ఖేలో ఇండియా సర్టిఫికెట్లను డిజిలాకర్‌తో అనుసంధానించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.