2025 కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రారంభం: కేవలం 15 రోజుల్లోనే దార్శనికతను వాస్తవంలోకి మార్చడం
January 16th, 02:18 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరాన్ని అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలతో ప్రారంభించారు, ప్రగతిశీల, స్వావలంబన మరియు ఐక్య భారతదేశం కోసం తన దార్శనికతను ప్రదర్శించారు. మౌలిక సదుపాయాలు మరియు శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడం నుండి యువతకు సాధికారత కల్పించడం మరియు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడం వరకు, ఆయన నాయకత్వం రాబోయే అద్భుతమైన సంవత్సరానికి నాంది పలికింది.డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి) పై ఎన్బిఎస్ సబ్సిడీకి అదనంగా వన్ టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించడానికి కేబినెట్ ఆమోదం
January 01st, 03:28 pm
డై -అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ)పై ఎన్ బిఎస్ సబ్సిడీకి అదనంగా మెట్రిక్ టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్యాకేజీని 01.01.2025 నుండి తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు డిఎపి ని తక్కువ ధరలో స్థిరంగా అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీని పెంచే చరిత్రాత్మక రైతు అనుకూల నిర్ణయం తీసుకున్న – కేంద్ర ప్రభుత్వం
May 19th, 07:57 pm
ఎరువుల ధరల అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, ఎరువుల ధరల అంశం గురించి, ఆయనకు, ఒక వివరణాత్మక ప్రదర్శన ద్వారా తెలియజేశారు.