సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్

May 16th, 10:30 pm

గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్‌ సమక్షంలో సంతకాలు చేశాయి.

డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

May 16th, 10:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్‌ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.

భారత రైల్వే వ్యవస్థను సుమారు 134 కి.మీ మేర విస్తరిస్తూ, గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో నూతన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

May 13th, 03:34 pm

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అహ్మదాబాద్ (సర్ఖేజ్)-ధోలేరా సెమీ హైస్పీడ్ డబుల్ లైన్‌ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా రూ.20,667 కోట్లు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు.. భారత రైల్వే వ్యవస్థలో తొలి సెమీ హైస్పీడ్ ప్రాజెక్టు.

గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం

May 11th, 06:15 pm

గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్‌ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.

గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 11th, 06:00 pm

గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్‌ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.

Gujarat’s biggest strength is that it has kept development moving continuously for the past 25 years: PM Modi in Vav-Tharad

March 31st, 05:00 pm

PM Modi launched and dedicated multiple development projects in Vav-Tharad, Gujarat, worth nearly ₹20,000 crore. Addressing a large gathering, he highlighted initiatives across roads, railways, power, water supply, urban development, healthcare and tourism aimed at boosting connectivity, improving public services and accelerating socio-economic growth in the region while strengthening the vision of a Viksit Bharat.

గుజరాత్‌లోని వావ్-థరద్‌లో ₹20,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం... శంకుస్థాపన.. దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 31st, 04:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా వావ్-థరద్‌లో ఉత్తర గుజరాత్ కోసం సుమారు ₹20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవిత్ర నవరాత్రి వేడుక ఇప్పుడే ముగియగా, ఇవాళ భగవాన్ మహావీర్ జయంతి కూడానని గుర్తుచేశారు. అలాగే, అంబాజీ మాత, భగవాన్ శ్రీ ధరణీధర్‌లకు నివాళి అర్పించారు.

గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 28th, 02:45 pm

గుజరాత్ ప్రజల ఆదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారూ, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా గారూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి గారూ, విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా...

గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 02:37 pm

గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభాన్ని సూచించే ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ సాంకేతిక నాయకత్వం వైపు భారత్ భారత ప్రయాణంలో ఒక ముందడుగు.

సంయుక్త ప్రకటన: యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ భారతదేశ పర్యటన

January 19th, 08:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించారు. గత దశాబ్ద కాలంగా భారత్-యూఏఈ 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతూనే ఉందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు.

‘వైబ్రంట్‌ గుజరాత్‌’ కచ్‌.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 11th, 02:45 pm

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 11th, 02:30 pm

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.

ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం

December 17th, 12:25 pm

పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని

December 17th, 12:12 pm

భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

October 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సనంద్ లో మరో సెమీ కండక్టర్ పరిశ్రమకు మంత్రివర్గం ఆమోదం

September 02nd, 03:32 pm

సెమీ కండక్టర్ పరిశ్రమల్ని ప్రోత్సహించే ధ్యేయంతో, గుజరాత్ లోని సనంద్ లో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గుజరాత్ లోని సనంద్ లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కెయిన్స్ సెమికన్ అనే ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. ప్రతిపాదిత యూనిట్‌ను రూ.3,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ లో రోజుకు 60 లక్షల చిప్‌లు ఉత్పత్తి కానున్నాయి.

Strong intent leads to good ideas, good ideas power innovation & innovation builds New India: PM Modi

January 17th, 03:15 pm

PM Narendra Modi and Israeli PM Benjamin Netanyahu today inaugurated iCreate - International Centre for Entrepreneurship and Technology at Ahmedabad, Gujarat. Encouraging the youngsters to innovate, the PM said that the Government was working to make the country’s system innovation-friendly. He said, “Intent leads to ideas, ideas have the power to drive innovation and innovation ultimately will lead to the creation of a New India.”

ఐక్రియేట్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెతన్యాహూ

January 17th, 03:14 pm

అహ‌మ‌దాబాద్ శివార్ల‌లో ఏర్పాటైన ఐక్రియేట్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెతన్యాహూ నేడు దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఆహార భ‌ద్ర‌త‌, నీరు, అనుసంధానం, సైబ‌ర్ సెక్యూరిటీ, ఐటీ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, శ‌క్తి, బ‌యో- మెడిక‌ల్ ఎక్విప్ మెంట్, ఇంకా ఉప‌క‌ర‌ణాల వంటి ప్ర‌ధాన అంశాల‌కు సంబంధించిన పరిష్కారాలను కనుగొనేందుకు నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, ఆస‌రాగా చేసుకొని సృజ‌నాత్మ‌క‌తను, ఇంజినీరింగ్‌ ను, ప్రోడ‌క్ట్ డిజైన్ ల‌ మేళ‌నంతో నవ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు తోడ్ప‌డాల‌నే ల‌క్ష్యంతో నెల‌కొల్పిన ఒక స్వ‌తంత్ర కేంద్ర‌మే ఐక్రియేట్‌. సిద్ధహ‌స్తులైన న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌యారు చేయ‌డం కోసం భార‌త‌దేశంలో ఒక అనువైన వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి ప‌ర‌చాల‌న్న‌దే ఐక్రియేట్ ధ్యేయం.

Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experience

August 21st, 12:05 pm

Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experience

CM chairs meeting of Gujarat Infrastructure Development Board

July 23rd, 06:50 pm

CM chairs meeting of Gujarat Infrastructure Development Board