ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), ఛత్తీస్ గఢ్ (భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (జమ్మూ), కర్ణాటక (ధార్వాడ్), కేరళ (పలక్కడ్) లోని అయిదు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం

May 07th, 12:10 pm

ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), ఛత్తీస్‌గఢ్ (ఐఐటి భిలాయి), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) లలో ఏర్పాటైన అయిదు కొత్త ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు (ఫేజ్-బి నిర్మాణం) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.