ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలసిన ఐదవ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ -
September 10th, 02:59 pm
ఆగా ఖాన్ అభివృద్ధి నెట్‌వర్క్ (ఏకేడీఎన్) చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్–5 ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.గుజరాత్‌లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 08th, 12:30 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.గుజరాత్‌లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
September 08th, 12:00 pm
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.సెప్టెంబరు 8న గుజరాత్, మహారాష్ట్రలలో ప్రధానమంత్రి పర్యటన
September 07th, 11:51 am
ప్రధాని మోదీ సెప్టెంబర్ 8న గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను కూడా ప్రారంభిస్తారు. సరుకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం నుండి డిజిటల్ ఫైనాన్స్ భవిష్యత్తును తీర్చిదిద్దడం వరకు, ఈ పర్యటన భారతదేశ వృద్ధి, ఆవిష్కరణల ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి ముఖాముఖి
September 05th, 10:00 am
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమావేశమయ్యారు. ఈ ఏడాది మూడు విభాగాలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు.ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 30th, 01:30 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26th, 10:22 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ప్రధానమంత్రితో ‘ఐఎఫ్ఎస్ 2025 బ్యాచ్’ ఆఫీసర్ ట్రైనీల సమావేశం
August 24th, 07:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’ (ఐఎఫ్ఎస్)-2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం సేవా తీర్థ్‌లో సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ‘ఐఎఫ్‌ఎస్’కు ఎంపికైన 50 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ బృందంలో ఉన్నారు.ప్రధానమంత్రితో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
August 22nd, 06:11 pm
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 09:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 21st, 08:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం
August 20th, 09:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణ మంత్రి భేటీ
August 20th, 09:04 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి సమావేశమయ్యారు.పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని ఎనిమిది జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం; భారతీయ రైల్వే నెట్‌వర్క్ దాదాపు 410 కి.మీల మేర పెంపు
August 19th, 03:18 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవే:అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి టెలిఫోన్ కాల్
August 08th, 10:58 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ జె.డి. వాన్స్ నుంచి టెలిఫోన్ కాల్ అందుకున్నారు.రూ.23,731 కోట్ల వ్యయంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కోసం జాతీయ సమగ్ర పథకం గోబర్ధన్‌కు కేబినెట్ ఆమోదం
August 06th, 04:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో... మొత్తం రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకమైన గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.అధికరణలు 370, 35(ఎ) రద్దుకు ఏడేళ్లు... చరిత్రాత్మక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని
August 05th, 02:25 pm
అధికరణలు 370, 35(ఎ)లను రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా... ఆ కీలక ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా 2019 ఆగస్టు 5ను ఆయన అభివర్ణించారు.ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
August 05th, 12:30 pm
ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.ఉన్నత లక్ష్యానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలని వివేకా స్మారకం స్ఫూర్తినిస్తుంది: కర్ణాటకలోని మైసూరులో ప్రధాని మోదీ
August 01st, 04:53 pm
కర్ణాటకలోని మైసూరులో ప్రధాని మోదీ ఈరోజు వివేకా స్మారకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అత్యంత పరిశుభ్రమైన పట్టణ కేంద్రాలలో స్థిరంగా స్థానం పొందుతున్నందుకు ఆ నగరాన్ని ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మరియు రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ సామర్థ్యాన్ని దేశం కలిగి ఉండేలా చేయడంలో యువత పాత్ర ఉందని ఆయన కొనియాడారు. దేశం కోసం స్వామి వివేకానంద యొక్క గొప్ప దార్శనికతను సాకారం చేసే అంతిమ బాధ్యతను స్వీకరించాలని ప్రధాని ప్రస్తుత తరానికి పిలుపునిచ్చారు.కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం - వివేక స్మారకను ప్రారంభించిన ప్రధాని మోదీ
August 01st, 04:00 pm
ప్రధాని మోదీ ఈరోజు కర్ణాటకలోని మైసూరులో వివేక స్మారకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అత్యంత పరిశుభ్రమైన పట్టణ కేంద్రాలలో ఒకటిగా మైసూరు స్థిరంగా నిలుస్తున్నందుకు ఆ నగరాన్ని ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మరియు రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ సామర్థ్యాన్ని దేశం కలిగి ఉండేలా చేయడంలో యువత పాత్ర ఉందని ఆయన కొనియాడారు. దేశం కోసం స్వామి వివేకానంద గారి గొప్ప దార్శనికతను సాకారం చేసే అంతిమ బాధ్యతను ప్రస్తుత తరం స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.