వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 08th, 08:39 am
పరిపాలన దక్షుడైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, వికసిత భారత నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్న అద్భుత సాంకేతిక ప్రగతికి సారథ్యం వహిస్తున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు.. టెక్నాలజీ సాయంతో ఎర్నాకులం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు.. కేంద్రంలోని నా సహచరులు సురేశ్ గోపీ గారు, జార్జ్ కురియన్ గారు.. కేరళలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. కేంద్రంలో నా సహచరుడు, పంజాబ్ నాయకుడు, ఫిరోజ్‌పూర్ నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అక్కడి ప్రజా ప్రతినిధులు.. లక్నో నుంచి పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ గారు.. ఇతర విశిష్ట అతిథులు.. కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులారా!వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 08th, 08:15 am
భారతదేశ ఆధునిక రైలు మౌలిక సదుపాయాల విస్తరణలో మరో ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. విశ్వనాథుని పవిత్ర నగరమైన వారణాసి స్థానిక కుటుంబాలందరికీ గౌరవ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల దేవ్ దీపావళి సందర్భంగా జరిగిన అసాధారణ వేడుకలను ఆయన గుర్తు చేశారు. ఈ రోజు కూడా ఒక శుభ సందర్భమని పేర్కొన్న ఆయన.. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.దేవ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 05th, 10:44 pm
దేవ దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ బాబా విశ్వనాథుని పుణ్యక్షేత్రం దేవ దీపావళి కాంతులతో వెలిగిపోతోంది. కాశీ ఘాట్‌లో గంగా నది ఒడ్డున వెలిగించిన లక్షలాది దీపాలు ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, సంపదతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాయి అని పేర్కొన్నారు.వారణాసిలో దేవ్ దీపావళి ఉత్సవాన్ని నిర్వహించినందుకు సంతోషంగా ఉంది: ప్రధానమంత్రి
November 15th, 11:13 pm
దేవ్ దీపావళి సందర్భంగా లక్షల కొద్దీ దీపాల వెలుగుల మధ్య కాశీ మిలమిలలాడినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు
November 15th, 04:55 pm
కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.కార్తికపూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
November 27th, 07:57 am
మంగళప్రదం అయినటువంటి కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్బం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.