శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి

June 10th, 11:50 pm

హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలం సేవలందించిన

June 10th, 02:08 pm

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాధినేతల నుంచి అభినందన సందేశాలను అందుకుంటున్నారు.

Prime Minister congratulates Ms. Mette Frederiksen on assuming office as the Prime Minister of Denmark

June 03rd, 06:45 pm

Prime Minister Shri Narendra Modi today congratulated Ms. Mette Frederiksen on assuming office as the Prime Minister of Denmark for a remarkable third consecutive term.

3వ ఇండియా-నార్డిక్ సదస్సు సందర్భంగా డెన్మార్క్ తాత్కాలిక ప్రధాన మంత్రితో సమావేశమైన భారత ప్రధాన మంత్రి

May 19th, 06:40 pm

ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు, ఉమ్మడి కార్యాచరణలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనిస్తూ రెండు దేశాల్లో హరిత పరివర్తనకు తోడ్పడేలా ఉమ్మడి ప్రయత్నాలను ఏకీకృతం చేసే 'భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సాధించిన పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2020లో ఈ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చలను గుర్తుచేసిన ఇరు దేశాల నాయకులు.. సరికొత్త- వర్ధమాన సాంకేతికతలు, కమ్యూనికేషన్స్, అధునాతన పరిశోధనలు, అంకురాలు, విద్యాసంబంధ మార్పిడి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారంపై కూడా వారు చర్చించారు. గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ'లో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన

May 19th, 04:25 pm

ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.

ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)

May 11th, 09:00 pm

ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.

సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 24th, 06:33 pm

సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడిన డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడరిక్సన్

September 16th, 07:29 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు డెన్మార్క్ ప్రధానమంత్రి గౌరవ మెట్టే ఫ్రెడరిక్సన్తో టెలిఫోన్ లో మాట్లాడారు.

డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 15th, 06:02 pm

డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్‌తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

When growth is driven by aspirations, it becomes inclusive and sustainable: PM Modi at Rising Bharat Summit

April 08th, 08:30 pm

PM Modi addressed the News18 Rising Bharat Summit. He remarked on the dreams, determination, and passion of the youth to develop India. The PM highlighted key initiatives, including zero tax on income up to ₹12 lakh, 10,000 new medical seats and 6,500 new IIT seats, 50,000 new Atal Tinkering Labs and over 52 crore Mudra Yojana loans. The PM congratulated the Parliament for enacting Waqf law.

న్యూస్18 ‘రైజింగ్ భారత్ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 08th, 08:15 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో న్యూస్‌ 18 నిర్వహించిన ‘ఉషోదయ భారత్‌ శిఖరాగ్ర సదస్సు’ (రైజింగ్ భారత్ సమ్మిట్‌)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగాగల గౌరవనీయ అతిథులతో మమేకమయ్యే అవకాశం కల్పించిందంటూ నెట్‌వర్క్18 యాజమాన్యానికి ఆయన ఈ సందదర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై నిర్వహించిన ‘వికసిత భారత్‌ యువ నాయకత్వ గోష్ఠి’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించే 2047 నాటికి భారత్‌ పురోగమన పథాన్ని వివరిస్తూ అడుగడుగునా నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయని పేర్కొన్నారు. అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

డెన్ మార్క్ ప్రధాని తోటెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

April 20th, 06:01 pm

డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో సంభాషించారు.

మెటెఫ్రెడరిక్ సన్ గారుడెన్మార్క్ ప్రధాని గా మళ్లీ ఎన్నికైనందుకు ఆమెకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

December 15th, 11:01 pm

డెన్ మార్క్ ప్రధాని గా మెటె ఫ్రెడరిక్ సన్ గారు తిరిగి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియజేశారు.

న్యూఢిల్లీలో పీఎం-కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 17th, 11:11 am

ఎక్కడ చూసినా పండుగల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి, దీపావళి తలుపు తడుతోంది. మరియు నేడు అలాంటి అవకాశం ఉంది, ఇదే ప్రాంగణంలో, ఇదే ప్రాంగణంలో, ఒకే వేదికపై, స్టార్టప్‌లు ఉన్నాయి మరియు దేశంలోని లక్షలాది మంది రైతులు ఉన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మరియు జై అనుసంధాన్, ఒక విధంగా, ఈ వేడుకలో, ఈ మంత్రం యొక్క సజీవ రూపాన్ని మనం చూస్తాము.

PM inaugurates PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute, New Delhi

October 17th, 11:10 am

The Prime Minister, Shri Narendra Modi inaugurated PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute in New Delhi today. The Prime Minister also inaugurated 600 Pradhan Mantri Kisan Samruddhi Kendras (PMKSK) under the Ministry of Chemicals & Fertilisers. Furthermore, the Prime Minister also launched Pradhan Mantri Bhartiya Jan Urvarak Pariyojana - One Nation One Fertiliser.

‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు

May 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్‌’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్‌, కాట్రిన్‌ జాకబడోట్టిర్‌, జోనాస్‌ గార్‌స్టోర్‌, మగ్దలీనా ఆండర్సన్‌, సనామారిన్‌ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

ప్రధానమంత్రి కి స్వాగతం పలికిన డెన్ మార్క్ మహారాణి రెండో మార్గరెట్ గారు

May 04th, 08:05 am

డెన్ మార్క్ మహారాణి రెండో మార్గరెట్ గారు కోపెన్ హేగన్ లోని చరిత్రాత్మకమైన అమాలియన్ బోర్ రాజమహలు లో ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి స్వాగతం పలికారు.

కోపెన్‌హాగన్‌ లోని భారతీయ సమాజంతో సంభాషించిన - ప్రధానమంత్రి

May 03rd, 09:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీమతి మెట్టె ఫ్రెడరిక్‌సెన్, కోపెన్‌హాగన్‌లోని బెల్లా సెంటర్‌ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులు, వ్యాపారవేత్తలతో కూడిన డెన్మార్క్‌ లోని భారతీయ సమాజానికి చెందిన సుమారు 1000 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

May 03rd, 07:40 pm

కోపెన్‌హాగన్‌లో జరిగిన ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి తన వ్యాఖ్యలలో, ఈ రోజుల్లో ఫోమో లేదా 'తప్పిపోతామనే భయం' అనే పదం సోషల్ మీడియాలో ట్రాక్షన్ పొందుతోంది. భారతదేశ సంస్కరణలు మరియు పెట్టుబడి అవకాశాలను చూస్తుంటే, మన దేశంలో పెట్టుబడి పెట్టని వారు ఖచ్చితంగా మిస్ అవుతారని చెప్పగలను.

డెన్మార్క్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 03rd, 07:11 pm

గౌరవనీయ డెన్మార్క్‌ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.