ఆస్ట్రేలియా-భారత్‌ ప్రధానమంత్రుల సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 09th, 11:15 am

అంతర్జాతీయ దృక్పథం, ప్రగాఢ పరస్పర విశ్వాసంతో రెండు దేశాలూ సంయుక్తంగా ముందడుగు వేయడంలో ఈ ఉమ్మడి విశిష్టతలే మనకెంతో స్ఫూర్తినిస్తాయి. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొన్నేళ్లుగా అద్భుత ప్రగతి సాధించిన నేపథ్యంలో నేటి మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య సహకార పరిధిని మరింత విస్తృతం చేసింది.

ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

July 07th, 03:15 pm

ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.

ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 03:00 pm

ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్‌.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పీఎం ప్రసంగానికి తెలుగు అనువాదం

July 06th, 06:47 pm

కేంద్ర క్యాబినెట్లో సహ మంత్రులు అమిత్ భాయ్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీజేపీ సీనియర్ సభ్యులు, నాలాంటి లక్షలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచే శ్రీ మఖన్‌లాల్ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శమిక్ భట్టాచార్య, గౌరవ ప్రజా ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 06th, 06:17 pm

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రయాణాల కారణంగా స్వయంగా హాజరుకాలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. ఇలాంటి ఒక చరిత్రాత్మక సందర్భంలో భౌగోళిక అడ్డంకులను అధిగమించటంలో డిజిటల్ అనుసంధానత అద్భుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సాంకేతికత సహాయంతో నేను ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మీతో భాగస్వామిని అవుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.

జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 02nd, 01:30 pm

ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్‌ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

June 25th, 10:53 am

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం... మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.

ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం

June 20th, 01:10 pm

గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.

ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన

June 20th, 01:00 pm

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.

ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 11:41 pm

కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.

ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

June 18th, 09:30 pm

ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,

June 18th, 05:00 am

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.

జి7 శిఖరాగ్ర సదస్సులో ‘అందరి కోసం సమతుల.. సమష్టి.. సుస్థిర ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ’పై సంధాన గోష్ఠి’లో ప్రధానమంత్రి ప్రసంగం

June 17th, 06:07 pm

అధ్యక్షులు మాక్రాన్‌ సహా గౌరవనీయ అతిథి సమూహానికి వందనం!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

June 10th, 09:45 pm

తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం కోసం మరింత అంకితభావం, విశ్వసనీయత, నిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆత్మీయ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

June 10th, 09:11 pm

తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ప్రజల అపారమైన ఆశీస్సులు, అభిమానాల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

May 22nd, 01:00 pm

పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన

May 17th, 11:43 pm

కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ

May 17th, 11:16 pm

భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు, సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

May 16th, 01:30 pm

ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

May 16th, 01:20 pm

నేడు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, భారతీయ మిత్రులు ఆయనకు ఎంతో ఉత్సాహంగా, ఘన స్వాగతం పలికారు.