ప్రధానిని కలిసిన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యులు

April 25th, 10:50 pm

శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసింది. విద్యాపరమైన ఉన్నతి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న సంస్థకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయనీ, సంస్థ విశిష్ట ప్రస్థానంలో ఇదొక కీలకమైన మైలురాయి అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగానికి కళాశాల దీర్ఘకాలిక సేవలనూ, తరతరాలుగా విభిన్న రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడంలో సంస్థ పాత్రను ఆయన కొనియాడారు.

ఆస్ట్రియా ఛాన్సలర్‌తో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

April 16th, 11:55 am

40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ భారతదేశ పర్యటనకు రావడం చాలా ముఖ్యమైన విషయం. 2026లో భారత్-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత భారత్-ఈయూ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఛాన్సలర్ స్టాకర్ పర్యటన ద్వారా మేం భారత్-ఆస్ట్రియా సంబంధాలను ఒక నూతన యుగంలోకి తీసుకెళ్తున్నాం.

ఫిన్లాండ్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

March 05th, 11:55 am

ఫిన్లాండ్ అధ్యక్ష హోదాలో తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన గౌరవనీయ అలెక్సాండర్‌ స్టూబ్‌ గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఆయనొక విశిష్ట ప్రపంచ నాయకుడు మాత్రమేగాక మాననీయ రచయిత.. విజ్ఞాని కూడా.

భారత్‌లో కెనడా ప్రధానమంత్రి పర్యటన

February 26th, 10:40 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్న కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఆయన 2026 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు భారత్‌లో అధికార పర్యటనలో ఉంటారు. ప్రధాని శ్రీ కార్నీ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటి సారి.

మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు

February 08th, 11:19 am

ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.

మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన

February 08th, 08:35 am

ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.

మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన

February 08th, 08:30 am

మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.

అరబ్ విదేశాంగ మంత్రుల ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 31st, 02:39 pm

భారత్‌లో జరుగుతున్న రెండో ఇండియా-అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు, లీగ్ ఆఫ్ అరబ్ దేశాల సెక్రటరీ జనరల్, అరబ్ ప్రతినిధి బృందాల నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

India and Ethiopia have shared continuous contact, dialogue and exchanges for thousands of years: PM Modi during meeting with Ethiopian PM Abiy Ahmed Ali

December 17th, 09:12 am

During his remarks at the meeting with Ethiopian PM Abiy Ahmed Ali, PM Modi announced that India–Ethiopia relations have been elevated to the level of a Strategic Partnership. The PM noted that both countries are democratic forces committed to peace and the welfare of humanity. He also expressed satisfaction over the decision to double the number of student scholarships for Ethiopia in India.

List of Outcomes Visit of Prime Minister to Jordan

December 15th, 11:52 pm

During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.

జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-IIతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 15th, 11:00 pm

నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. భారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సానుకూల ఆలోచనలను మీరు ప్రతిపాదించారు. మీ స్నేహానికి, భారత్ పట్ల చూపిన ప్రాధాన్యతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

Prime Minister meets delegation of the 16th Finance Commission led by Chairman Dr. Arvind Panagariya

November 17th, 08:11 pm

The Prime Minister, Shri Narendra Modi, met a delegation of the 16th Finance Commission members led by the Chairman of the Commission, Dr. Arvind Panagariya.

వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుపై భారత్, ఫిలిప్పీన్స్ ప్రకటన

August 05th, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025 ఆగస్టు 4 నుంచి భారత్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. అధ్యక్షుడు మార్కోస్ వెంట ప్రథమ మహిళ శ్రీమతి లూయిస్ అరనెటా మార్కోస్ తో పాటు ఫిలిప్పీన్స్ కు చెందిన పలువురు క్యాబినెట్ మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి అధికార, ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి వర్గాలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నాయి.

భారత్‌లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అధికారిక పర్యటన: ఒప్పందాలు/ఎంవోయూలు

August 05th, 04:31 pm

భారత్, ఫిలిప్పీన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుపై ప్రకటన

ఫిలిప్పీన్స్ అధ్యక్షునితో సమావేశం సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసానికి తెలుగు అనువాదం

August 05th, 03:45 pm

మీకు, మీ ప్రతినిధివర్గానికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు మన రెండు దేశాల సంబంధాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుంది. మనం భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలను ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇది మన బంధానికి ఒక కొత్త జోరును, సమగ్రతను జోడిస్తుంది. గత కొన్నేళ్లుగా వాణిజ్యం, రక్షణ, నౌకావాణిజ్య సహకారం, ఆరోగ్య సంరక్షణ, భద్రత, తగినన్ని ఆహారపదార్థాల నిల్వలు కలిగి ఉండటం, అభివృద్ధి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అన్ని రంగాల్లో మన సంబంధాలు ముందంజ వేశాయి. వచ్చే అయిదేళ్లకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానిని మనం అమలు చేయబోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చే అంశం.

Delegation of Special Envoys from the Republic of Korea meets Prime Minister

July 17th, 06:40 pm

A delegation of Special Envoys from the Republic of Korea (ROK), led by Mr. Kim Boo Kyum, met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

July 09th, 06:02 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.

పరాగ్వే అధ్యక్షునితో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఆహ్వాన ప్రకటన

June 02nd, 03:00 pm

మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేం చాలా స్నేహపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. దక్షిణ అమెరికాలో పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చు, కానీ మనం ఒకే తరహా ప్రజాస్వామిక విలువలను పంచుకొంటున్నాం. అంతేకాక మన దేశాల ప్రజల అభ్యున్నతి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొంటున్నాం.

విద్యుత్ రంగానికి బొగ్గు కేటాయింపు కోసం సవరించిన శక్తి (భారత్‌లో పారదర్శకంగా బొగ్గు వినియోగం, కేటాయింపు పథకం) విధానానికి మంత్రివర్గం ఆమోదం

May 07th, 12:07 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ- కేంద్ర ప్రభుత్వ రంగ/ రాష్ట్ర ప్రభుత్వ రంగ/ స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులకు చెందిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తాజాగా బొగ్గు కేటాయింపులకు (కోల్ లింకేజీలు) ఆమోదం తెలిపింది. సవరించిన శక్తి విధానం కింద ఈ రెండు విండోలను ప్రతిపాదించారు:

అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

May 03rd, 01:00 pm

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.