నవంబర్ 9న డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

November 08th, 09:26 am

నవంబర్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు (రజత మహోత్సవం) పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను కూడా విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

డెహ్రాడూన్‌లో ప్రధాని పర్యటన.. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం అంచనాపై సమీక్ష సమావేశం

September 11th, 06:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్‌ను సందర్శించి.. ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సెప్టెంబరు 11న ప్రధాని పర్యటన

September 10th, 01:01 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 11న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పర్యటించనున్నారు.

23 ఫిబ్రవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 119 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 23rd, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతిచోటా క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్‌లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను. కానీ భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైంది. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ, విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 విజయం కావచ్చు. ఒకే రాకెట్‌తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 సంవత్సరాలలోనే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో మనం గమనిస్తోన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య వందలకు చేరుకుంటుందని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉంటారు! జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 28th, 09:36 pm

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం

January 28th, 09:02 pm

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివ‌ృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.

డెహ్రాడూన్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో దేశీయ ఉత్పత్తులగురించి ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

December 08th, 05:11 pm

డెహ్రాడూన్లో ఇన్వెస్టర్ల సమావేశంలో దేశీయ ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.

డిసెంబరు 8 వ తేదీ న దెహ్‌రాదూన్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ప్రారంభిస్తారు

December 06th, 02:38 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 8 వ తేదీ న ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ ను సందర్శించనున్నారు. ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ఉదయం సుమారు 10:30 గంటల వేళ కు దెహ్‌రాదూన్ లోని ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ప్రారంభిస్తారు. ఈ సందర్భం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

PM to visit Uttarakhand on 12th October

October 10th, 08:12 pm

Prime Minister Shri Narendra Modi will visit Uttarakhand on 12th October, 2023.

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

May 25th, 11:30 am

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 11:00 am

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.

దేహ్ రాదూన్ నుండి దిల్లీ మధ్య ఒకటో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కు మే నెల 25 న పచ్చజెండా ను చూపి ఆ రైలు ను ప్రారంభించనున్నప్రధాన మంత్రి

May 24th, 04:18 pm

ఇది ఉత్తరాఖండ్ లో ఆరంభం అయ్యే ఒకటో వందే భారత్ రైలు

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.

పరీక్షలను గురించి దెహ్ రాదూన్ లోని కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తన స్వయం గారచించినటువంటి కవిత ను శేర్ సినందుకు గాను ఆ బాలిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

January 07th, 03:55 pm

పరీక్షల ను గురించి దెహ్ రాదూన్ లో కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తాను స్వయం గా రచించిన ఒక కవిత ను శేర్ చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఉత్తరాఖండ్ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకరించిన శ్రీ పుష్కర్ సింహ్ ధామీ కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

March 23rd, 02:30 pm

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా శ్రీ పుష్కర్ సింహ్ ధామీ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

దెహ్ రాదూన్ విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా కు చిన్న వయస్సు లోనే జాతీయహితం ముడిపడ్డ అంశాల పై ఉన్న అవగాహన ను మెచ్చుకొంటూ అతడి కి ఉత్తరం రాసిన ప్రధానమంత్రి

March 11th, 02:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ యువతరం యొక్క, ప్రత్యేకించి విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తూ ఉంటారు. ఇందుకోసం వారితో ఆయన తరచు గా మాట్లాడుతూ ఉంటారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కావచ్చు, లేదా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం కావచ్చు, లేదా వ్యక్తిగత సంభాషణ లు కావచ్చు.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లవేళలా వివిధ మాధ్యమాల ద్వారా యువత యొక్క మనోభావాల ను మరియు యువత యొక్క కుతూహలాన్ని గురించి అర్థం చేసుకోవడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమం లో భాగం గా, దెహ్ రాదూన్ లో 11వ తరగతి విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా లోని కళాప్రతిభ ను, ఆలోచనల ను ప్రధాన మంత్రి మరొక్క మారు ప్రశంసిస్తూ, అతడి ఉత్తరాని కి సమాధానాన్ని రాశారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధికి కృషి చేయడం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రాధాన్యత: ప్రధాని మోదీ

February 07th, 02:40 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

February 07th, 02:39 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

December 04th, 12:35 pm

ఉత్తరాఖండ్‌లోని గౌరవనీయులైన పెద్దలు, సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరులు మరియు సోదరీమణులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు కుశలమని ఆశిస్తున్నాను. దయచేసి నా శుభాకాంక్షలను అంగీకరించండి.

డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి

December 04th, 12:34 pm

ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను; దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు; యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు; డెహ్రాడూన్‌ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం; డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.