నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 08:00 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.భారత్ - అమెరికా సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటనకు తెలుగు అనువాదం
February 14th, 04:57 am
ముందుగా నాకు ఆత్మీయ స్వాగతాన్ని, ఆతిథ్యాన్ని అందించిన నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ట్రంప్ తన నాయకత్వ పటిమ ద్వారా భారత్-అమెరికా మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేశారు.భారత్లో టాంజానియా అధ్యక్షురాలి పర్యటన.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం నేపథ్యంలో (2023 అక్టోబరు 8-10) సంయుక్త ప్రకటన
October 09th, 06:57 pm
2. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధ్యక్షురాలు గౌరవనీయ సమియా సులుహు హసన్‌కు 2023 అక్టోబర్ 9న అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. అనంతరం ఆమె రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆమె గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. అటుపైన వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.