India and Ethiopia have shared continuous contact, dialogue and exchanges for thousands of years: PM Modi during meeting with Ethiopian PM Abiy Ahmed Ali
December 17th, 09:12 am
During his remarks at the meeting with Ethiopian PM Abiy Ahmed Ali, PM Modi announced that India–Ethiopia relations have been elevated to the level of a Strategic Partnership. The PM noted that both countries are democratic forces committed to peace and the welfare of humanity. He also expressed satisfaction over the decision to double the number of student scholarships for Ethiopia in India.Joint Statement on the visit of PM Modi to the Hashemite Kingdom of Jordan
December 16th, 03:56 pm
At the invitation of HM King Abdullah II, PM Modi visited Jordan on December 15-16, 2025. Both the leaders positively assessed the multi-faceted India-Jordan relations that span across various areas of cooperation including political, economic, defence, security, culture and education among others. They also appreciated the excellent cooperation between the two sides at the bilateral level and in multilateral forums.జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన
December 11th, 08:43 pm
మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
December 06th, 08:14 pm
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 08:13 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భారత్ – రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధాని ప్రసంగం
December 05th, 03:45 pm
భారత్ - రష్యా బిజినెస్ ఫోరంలో, ఇంతపెద్ద ప్రతినిధి బృందంతో నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవ అత్యంత కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నేడు మీ అందరి మధ్య ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ ఫోరంలో పాల్గొని తన విలువైన అభిప్రాయాలను పంచుకున్న నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వ్యాపారం కోసం సరళీకృత సానుకూల యంత్రాంగాలను ఏర్పాటు చేస్తున్నాం. భారత్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఎఫ్‌టీఏపై చర్చలు మొదలయ్యాయి.రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌తో కలసి భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 05th, 03:30 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో అధ్యక్షుడు పుతిన్‌కు, దేశవిదేశాలకు చెందిన నాయకులకు, విశిష్ట అతిథులకు ప్రధాని నమస్కరించారు. అతి పెద్ద ప్రతినిధి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవను ఈ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ.. వారి మధ్య ఉండటం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, విలువైన సూచనలను అందించిన తన స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వాణిజ్యానికి సరళమైన, విశ్వసనీయమైన వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, భారత్, యురేషియన్ ఆర్థిక సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు.Cabinet approves Rs.7,280 Crore for Sintered Rare Earth Permanent Magnets Scheme
November 26th, 04:25 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the 'Scheme to Promote Manufacturing of Sintered Rare Earth Permanent Magnets' with an outlay of Rs. 7,280 crore. The initiative aims to establish 6,000 MTPA of integrated Rare Earth Permanent Magnet manufacturing in India, boosting self-reliance and strengthening India's position in the global market.శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 25th, 10:20 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, అత్యంత గౌరవనీయులైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి శ్రీ ఆదిత్యనాథ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయ మహంత్ శ్రీ నృత్య గోపాల్ దాస్, గౌరవనీయ సాధు సమాజం, ఇక్కడ హాజరైన భక్తులు సహా ఈ చారిత్రక సందర్భంలో దేశవిదేశాల నుంచి పాలు పంచుకుంటున్న కోట్లాది రామ భక్తులు సహా సోదరీసోదరులారా!అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 10:13 am
దేశ సామాజిక- సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఓ చిరస్మరణీయ సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రమైన శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ధ్వజారోహణోత్సవం ఆలయ నిర్మాణం పూర్తవ్వడాన్ని సూచిస్తుంది. అలాగే భారత సాంస్కృతిక వేడుకలకు, జాతీయ ఐక్యతకు కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుపుతుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేడు యావత్ భారత్, ప్రపంచం శ్రీరాముడి స్ఫూర్తితో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రతి రామ భక్తుడి హృదయంలో ఒక ప్రత్యేక సంతృప్తి, అపారమైన కృతజ్ఞత, అనంతమైన ఆనందం ఉన్నాయని ఆయన అన్నారు. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని, శతాబ్దాల బాధ ముగిసిపోతోందని, శతాబ్దాల సంకల్పాలు నేడు నెరవేరుతున్నాయని తెలిపారు. ఇది 500 సంవత్సరాలుగా జ్వలిస్తూనే ఉన్న యజ్ఞానికి ముగింపు ఇది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశ్వాసంలో ఎప్పుడూ చలించని, నమ్మకంలో ఒక్క క్షణం కూడా విచ్ఛిన్నం కాని యజ్ఞం ఇది అని అన్నారు. నేడు శ్రీరాముడి గర్భగుడిలోని అనంతమైన శక్తి, శ్రీరాముడి కుటుంబ దివ్య వైభవం ఈ ధర్మ ధ్వజం రూపంలో అత్యంత దివ్యమైన, గొప్ప ఆలయంలో ప్రతిష్ఠించినట్లు స్పష్టం చేశారు.జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
November 23rd, 09:46 pm
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025
November 23rd, 09:44 pm
PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.జోహాన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
November 23rd, 09:41 pm
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇద్దరూ భారత్, కెనడా భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధాని మోదీ
November 21st, 10:43 pm
దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను 2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిన అనంతరం గత ఐదేళ్లలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సహకారం మరింత బలంగా, వైవిధ్యంగా మారటం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రధానమంత్రి అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు.నవంబర్ 8న ‘‘ న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి
November 06th, 02:50 pm
సుప్రీంకోర్టులో ‘‘న్యాయ సహాయ పంపణీ వ్యవస్థల బలోపేతం’’ జాతీయ సదస్సును 2025 నవంబర్ 8న సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవల అథారిటీ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) రూపొందించిన కమ్యూనిటీ మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.జపాన్ ప్రధానమంత్రి శ్రీమతి హెచ్ఈ సానే తకాయిచీకి ప్రధానమంత్రి అభినందనలు; భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లటంపై చర్చ
October 29th, 01:14 pm
జపాన్ ప్రధానమంత్రి హెచ్ఈ సానే తకాయిచీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
October 21st, 09:30 am
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారు. ఒక వైపు విశాల మహాసముద్రం ఉంటే, మరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక వైపు దిగంతం, ఆనంతాకాశం ఉంటే, మరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీ, ఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారు. సముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారుఅనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 10:30 am
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం
October 20th, 10:00 am
ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ
October 17th, 04:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దుల్లాటీ ఈ రోజు సమావేశమయ్యారు.