We are working with a spirit of service for the welfare of all sections of society: PM Modi in Banswara, Rajasthan
September 25th, 02:32 pm
PM Modi inaugurated and laid the foundation stone for development projects worth over ₹1,22,100 cr in Banswara, Rajasthan. “India is moving fast towards becoming a developed nation, with Rajasthan playing a key role,” he said. Further the PM highlighted energy and tribal welfare initiatives, including new solar projects under PM Surya Ghar and PM-KUSUM. PM Modi also emphasised youth employment and urged citizens to embrace Swadeshi.రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో రూ.1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం
September 25th, 02:30 pm
రాజస్థాన్లోని బాన్స్‌వారాలో రూ. 1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజున బాన్స్‌వారలోని మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించే అవకాశం తనకు లభించిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కాంఠల్, వాగడ్‌లో గంగగా పూజలందుకొనే మాతా మాహీని చూసే అవకాశం కూడా తనకు లభించిందన్నారు. భారతీయ గిరిజన తెగల స్థైర్యానికీ, పోరాటతత్వానికీ మాహీ జలాలు ప్రతీక అని ప్రధానమంత్రి వర్ణించారు. మహాయోగి గోవింద్ గురు స్ఫూర్తిదాయక నాయకత్వం గురించి వివరిస్తూ... ఆయన గొప్పతనం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆ గొప్ప గాథకు మాహీ జలాలు సాక్ష్యంగా నిలుస్తాయని తెలిపారు. మాతా త్రిపుర సుందరి, మాత మాహీలకు, శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. భక్తి, ధైర్యం నిండిన ఈ నేల నుంచి మహారాణా ప్రతాప్, రాజా బాంసియా బీల్‌కు ఆయన నివాళులు అర్పించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
February 11th, 01:45 pm
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు దేశసేవకే అంకితమైన దార్శనికుడు. సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తి అభ్యుదయం కోసం శ్రమించాలన్న ఆయన ఆదర్శం, బలమైన దేశంగా ఎదిగేందుకు మనం చేస్తున్న కృషికి స్ఫూర్తిని అందిస్తూనే ఉంది” అని శ్రీ మోదీ అన్నారు.గంగానదిపై రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి సహా 'వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బహుళ మార్గాల బ్రిడ్జి' నిర్మాణాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి
October 16th, 03:18 pm
ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, రైల్వే శాఖకు చెందిన రూ.2,642 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బహుళ మార్గాల నూతన ప్రాజెక్టు వివిధ మార్గాల్లో రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేయడమే కాక, భారతీయ రైల్వేలకు చెందిన అతి రద్దీ మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి-ఛందౌలీ మధ్య ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.