ఈశాన్య ఢిల్లీలోని దయాళ్‌పూర్‌లో భవనం కూలిన ఘటన... ప్రాణనష్టం... ప్రధానమంత్రి సంతాపం
April 19th, 09:02 pm
ఈశాన్య ఢిల్లీలోని దయాళ్‌పూర్‌లో ఒక భవనం శనివారం కూలిపోయి ప్రాణనష్టం జరగగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఆ వ్యక్తుల కుటుంబాలకు ఇస్తామని, గాయపడిన వారికి రూ.50,000 వంతున అందజేస్తామని ఆయన ప్రకటించారు.