రాజస్థాన్‌లోని దౌసాలో ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

August 13th, 05:26 pm

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.