అస్సాంలోని దరంగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 14th, 11:30 am
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! అస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.అస్సాంలోని దరంగ్‌లో రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని దరంగ్‌లో దాదాపు రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- అస్సాం ప్రగతి పయనంలో నేటి కార్యక్రమం చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు దరంగ్ ప్రజలతోపాటు రాష్ట్ర పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.