25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
April 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.దంతెవాడ లో ఛత్తీస్ గఢ్పోలీసుల పైన జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి
April 26th, 05:03 pm
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా లో ఛత్తీస్ గఢ్ పోలీసుల పైన జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. దాడి లో ప్రాణాల ను కోల్సోయిన సాహసిక సిబ్బంది కి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సైతం అర్పించారు.సమాజం యొక్క అడ్డంకులను నారిశక్తి అధిగమిస్తుంది: మన్ కి బాత్ లో ప్రధాని
January 28th, 11:45 am
నూతన సంవత్సరం యొక్క మొదటి 'మన్ కి బాత్' లో, మహిళా సాధికారత, స్వచ్ఛత, జన ఔషధి కేంద్రాలు, పద్మ అవార్డుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. శాంతి, అహింసా మంత్రాలను మాత్రమే నమ్మిన మహాత్మా గాంధీని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినట్లయితే, అది మహాత్మాకు సరైన నివాళిఅవుతుందన్నారు.Text of PM’s interaction with students at Education City, Dantewada
May 09th, 07:23 pm
Chhattisgarh has the ability to transform India's future: PM Modi in Bastar
May 09th, 07:10 pm
PM at Dantewada
May 09th, 03:38 pm
MoUs signed at Dantewada, in the presence of Prime Minister Shri Narendra Modi
May 09th, 12:45 pm
PM's visit and interaction with students at Education City, Jawanga, Dantewada
May 09th, 12:40 pm