శ్రీమతి భావనాబెన్ పటేల్ మృతి... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
June 22nd, 01:10 pm
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ; దమన్, దీవ్ పాలకుడు శ్రీ ప్రభుల్‌భాయి పటేల్ భార్య శ్రీమతి భావనాబెన్ పటేల్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.దమన్‌లో నమో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి
June 05th, 10:25 pm
నేడు దమమన్‌లో నమో ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ ఆసుపత్రి... ఈ కేంద్రపాలిత ప్రాంతం, దీని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను తీర్చడంలో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.దమన్ నమో విమానాశ్రయంలోని అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
June 05th, 10:18 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దమన్‌లోని నమో విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సాయంత్రం ప్రారంభించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 10:11 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు.గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి
June 05th, 10:08 pm
గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న సామర్థ్యాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 07:20 pm
మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం.డామన్‌లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 07:15 pm
డామన్‌లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.జూన్ 5న సూరత్, దమన్‌లలో ప్రధానమంత్రి పర్యటన
June 04th, 10:03 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26న గుజరాత్, దమన్‌లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు, ప్రధానమంత్రి సూరత్ జిల్లా హజీరాలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, సూరత్‌లో సుమారు రూ.18,800 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమివ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.సిల్వస్సాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 07th, 03:00 pm
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.మార్చి 7, 8 లలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్‌తో పాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
March 07th, 07:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 7, 8 లలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ తోపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆయన మార్చి 7వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ సిల్‌వాసాకు చేరుకొని నమో ఆసుపత్రి ఒకటో దశ (NAMO Hospital)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల 45 నిమిషాలకు, సిల్‌వాసాలో కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ. 2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దీని తరువాత ఆయన సూరత్‌కు వెళ్తారు. ఆయన సాయంత్రం సుమారు 5 గంటలకు సూరత్ ఆహార భద్రత విస్తృత ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. మార్చి 8న ప్రధాని నవ్‌సారీకి వెళ్తారు. ఉదయం దాదాపు 11 గంటల 30 నిమిషాలకు లఖ్‌పతి దీదీలతో (లక్షాధికారి సోదరీమణులు) భేటీ అయ్యి వారితో మాట్లాడతారు. తరువాత ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పథకాలను ప్రారంభించనున్నారు.దమన్ లోని నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు నుదేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
April 25th, 11:23 pm
దమన్ లో నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. ప్రధాన మంత్రి కార్య స్థలాని కి చేరుకొన్న తరువాత నిర్మాణ శ్రమికుల తో మాట్లాడారు. వారితో కలసి ఒక ఛాయాచిత్రాన్ని తీయించుకొన్నారు. ఆయన ‘నయా భారత్ సెల్ఫీ పాయింటు’ ను సైతం చూడడానికి వెళ్లారు.సిల్వస్సాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, వాటి అంకితం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 25th, 04:50 pm
వేదికపై శ్రీ ప్రఫుల్ పటేల్, ఎంపీలు శ్రీ వినోద్ సోంకర్ మరియు సోదరి కాలాబెన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నిషా భవార్ గారు, రాకేష్ సింగ్ చౌహాన్ గారు, వైద్య రంగానికి చెందిన సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? అంతా బాగుంది మరియు సంతోషంగా ఉంది! పురోగతి సాధిస్తోంది! ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. డామన్, డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీల అభివృద్ధి యాత్రను చూడటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇంత చిన్న ప్రాంతంలో జరుగుతున్న ఆధునిక, సర్వతోముఖాభివృద్ధిని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడే మనకు చూపించిన డాక్యుమెంటరీలో మనం దీనిని చూశాము.దాద్రా, నగర్ హవేలికి చెందిన సిల్వాసాలో రూ.4850 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి
April 25th, 04:49 pm
దాద్రా, నగర్ హవేలిలోని సిల్వాసాలో రూ.4850 కోట్లకు పైబడిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో సిల్వాసాలో నమో వైద్య విద్య, పరిశోధన సంస్థను జాతికి అంకితం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, డమన్ లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణం; వివిధ రోడ్ల సుందరీకరణ, విస్తరణ; చేపల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, నీటి సరఫరా స్కీమ్ సామర్థ్యం పెంపు వంటి 96 పథకాలకు శంకుస్థాపన చేశాయి. డయ్యూ, సిల్వాసాల్లో పిఎంఏవై అర్బన్ లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందచేశారు.ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి
April 21st, 03:02 pm
24వ తేదీ ఉదయం 11-30కు ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ ఆయన రూ. 19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు. 25వ తేదీ ఉదయం 10-30కు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి వందే భారత్ ఎక్సప్రెస్ కు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ. 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.బీచ్‌ల అభివృద్ధి.. పరిశుభ్రత దిశగా దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన కీలక ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 07th, 11:17 am
దేశంలో బీచ్‌ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 71,000 మందికి నియామక లేఖల పంపిణీ కోసం నిర్వహించిన ఉపాధి మేళాలో ప్రధాని ప్రసంగ తెలుగు పాఠం
November 22nd, 10:31 am
మీకందరికీ అనేక అభినందనలు… ఇవాళ దేశంలోని 45 నగరాల్లో 71,000 మందికిపైగా యువతకు నియామక లేఖలు ప్రదానం చేయబడుతున్నాయి. నేడు వేలాది ఇళ్లలో నవ సౌభాగ్య శకం ప్రారంభమైంది. గతనెలలో ధన్‌తేరస్ రోజున కేంద్ర ప్రభుత్వం 75,000 మంది యువతకు నియామక లేఖల ప్రదానం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఈ ‘ఉపాధి సమ్మేళనమే’ నిదర్శనం.దాదాపు గా 71,000 నియామక పత్రాల ను కొత్త గా ఉద్యోగం లోకిచేర్చుకొన్న వారికి రోజ్ గార్ మేళా లో భాగం గా పంపిణీ చేసిన ప్రధాన మంత్రి
November 22nd, 10:30 am
దాదాపు గా 71,000 నియామక లేఖల ను కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేశారు. ఉద్యోగ కల్పన కు అండగా నిలవడం లో ఒక ఉత్ప్రేరకం గా రోజ్ గార్ మేళా పని చేస్తుందన్న ఆశ తో పాటు యువతీయువకుల కు వారి యొక్క సశక్తీకరణ సాధన లోను, దేశాభివృద్ధి లో వారికి ప్రత్యక్ష ప్రాతినిధ్యాన్ని కల్పించడం లోను ఒక అవకాశాన్ని అందిస్తందన్న ఆశ కూడా ఉంది. ఇంతకు ముందు అక్టోబరు లో, 75వేల నియామక పత్రాల ను సరికొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు రోజ్ గార్ మేళా లో భాగం గా ప్రదానం చేయడమైంది.గోవాలోని పనాజీలో హర్ ఘర్ జల్ ఉత్సవ్‌లో ప్రధాన మంత్రి వీడియో సందేశం
August 19th, 04:51 pm
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీ , కేంద్ర జల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జీ , గోవా ప్రభుత్వంలోని ఇతర మంత్రులు , ఇతర ప్రముఖులు , మహిళలు మరియు పురుషులు , ఈ రోజు చాలా ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబురాలు మిన్నంటాయి. దేశప్రజలందరికీ , ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుని భక్తులందరికీ శుభాకాంక్షలు. జై శ్రీ కృష్ణజల్ జీవన్ మిశన్లో భాగం గా హర్ ఘర్ జల్ ఉత్సవ్ నుఉద్దేశించి వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 19th, 12:12 pm
జల్ జీవన్ మిశన్ లో భాగం గా జరిగిన హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం గోవా లోని పణజీ లో జరిగింది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ తదితరులు ఉన్నారు. మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్బం లో శ్రీకృష్ణ భక్తుల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.