అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 01st, 01:38 pm
నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
February 01st, 01:00 pm
భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాడి రైతులకు సాధికారతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: ప్రధానమంత్రి
September 04th, 08:43 pm
రాష్ట్రీయ గోకుల్ మిషన్, సహకార సంస్థలకు మెరుగైన మద్దతు, అన్ని రంగాల్లో నిరంతర సంస్కరణల వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పాడి పరిశ్రమను ఆధునికీకరించడం, మరింత శక్తిమంతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. తాజా #NextGenGST సంస్కరణలు ఈ లక్ష్యం దిశగా ఒక కీలక ముందడుగును సూచిస్తాయి.భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన
March 17th, 01:05 pm
న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వకంగా భారత్‌కు స్వాగతం పలుకుతున్నాను. ప్రధానమంత్రి లగ్జాన్‌కు ఈ దేశంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆక్లాండ్‌లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో ఆయన ఎలా జరుపుకొన్నారో కొన్ని రోజుల కిందటే మనమందరం చూశాం. భారత్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన వెంట వచ్చిన ప్రతినిధులను బట్టి, న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారత సంతతి ప్రజల పట్ల ప్రధాని లగ్జాన్‌కు ఎంతటి ఆప్యాయతాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతిభావంతుడైన నాయకుడు ఈ ఏడాది రైజీనా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషదాయకం.సిల్వస్సాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 07th, 03:00 pm
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.బడ్జెట్ అనంతర వెబినార్‌లో వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి ప్రసంగం
March 01st, 01:00 pm
బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 12:30 pm
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.Modernization of agriculture systems is a must for Viksit Bharat: PM Modi
February 24th, 10:36 am
PM Modi inaugurated and laid the foundation stone of multiple key initiatives for the Cooperative sector at Bharat Mandapam, New Delhi. Recalling his experience as CM of Gujarat, the Prime Minister cited the success stories of Amul and Lijjat Papad as the power of cooperatives and also highlighted the central role of women in these enterprises.సహకార రంగానికి చెందిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పిఎం
February 24th, 10:35 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్ లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్ కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.Amul has become the symbol of the strength of the Pashupalaks of India: PM Modi
February 22nd, 11:30 am
Prime Minister Narendra Modi participated in the Golden Jubilee celebration of the Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) at Narendra Modi Stadium in Motera, Ahmedabad. Addressing the gathering, the Prime Minister congratulated everyone for the Golden Jubilee celebration of Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) and said that a sapling that was planted 50 years ago by the farmers of Gujarat has become a giant tree with branches all over the worldగుజరాత్లోని అహ్మాదాబాద్లో , గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
February 22nd, 10:44 am
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరాలో గల శ్రీనరేంద్రమోదీ స్టేడియంలో ఈ స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు.అనంతరం ప్రధానమంత్రి , స్వర్ణోత్సవాల సందర్భంగా కాఫీటేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. జిసిఎంఎంఎఫ్ సహకార రంగం శక్తికి , రైతుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే బలమైన బ్రాండ్‌గా అమూల్ నిలిచింది.Swarved Mahamandir is a modern symbol of India’s social and spiritual strength: PM Modi
December 18th, 12:00 pm
PM Modi inaugurated Swarved Mandir in Umaraha, Varanasi, UP. He highlighted the contributions of Maharshi Sadafal Dev Ji towards knowledge and Yog in the previous century and said that its pine light has transformed the lives of millions of people around the world. He expressed confidence that every offering to the Mahayajna will strengthen the resolve of Viksit Bharat.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 18th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఉమరహాలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. మహర్షి సదాఫల్ దేవ్ జీ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాన మంత్రి, ఆలయ సముదాయాన్ని సందర్శించారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను కాశీ సందర్శకు ఈరోజు రెండో రోజు అని, కాశీలో గడుపుతున్న ప్రతి క్షణమూ అపూర్వమైన అనుభూతులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం అఖిల భారతీయ విహంగం యోగ్ సంస్థాన్ వార్షిక ఉత్సవాలను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి, ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్లో భాగమయ్యే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ విహంగం యోగ సాధన వంద సంవత్సరాల మరపురాని ప్రయాణాన్ని సాధించిందని అన్నారు. మునుపటి శతాబ్దంలో జ్ఞానం, యోగా పట్ల మహర్షి సదాఫల్ దేవ్ జీ చేసిన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాని దివ్య కాంతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిందని అన్నారు. ఈ శుభ సందర్బంగా, 25,000 కుండియా స్వర్వేద్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తుతించారు. మహాయజ్ఞానికి ఇచ్చే ప్రతి సమర్పణ వికసిత్ భారత్ సంకల్పాన్ని బలపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అతను మహర్షి సదాఫల్ దేవ్ జీ కి నివాళులు అర్పిస్తూ, దర్శనాన్ని అందించిన సాధువులందరికీ కూడా తన నివాళులర్పించాడు.Gujarat has given the nation the practice of elections based on development: PM Modi in Jambusar
November 21st, 12:31 pm
In his second rally for the day at Jambusar, PM Modi enlightened people on how Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams. PM Modi further highlighted that Gujarat is able to give true benefits of schemes to the correct beneficiaries because of the double-engine government.There was a time when Gujarat didn't even manufacture cycles, today the state make planes: PM Modi in Surendranagar
November 21st, 12:10 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Gujarat’s Surendranagar. Highlighting the ongoing wave of pro-incumbency in the state, PM Modi said, “Gujarat has given a new culture to the country's democracy. In the decades after independence, whenever elections were held, there was a lot of discussion about anti-incumbency. But Gujarat changed this tradition to pro-incumbency.”PM Modi campaigns in Gujarat’s Surendranagar, Jambusar & Navsari
November 21st, 12:00 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a public meeting in Gujarat’s Surendranagar, Jambusar & Navsari. Highlighting the ongoing wave of pro-incumbency in the state, PM Modi said, “Gujarat has given a new culture to the country's democracy. In the decades after independence, whenever elections were held, there was a lot of discussion about anti-incumbency. But Gujarat changed this tradition to pro-incumbency.”రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి సమాధానం
February 08th, 08:30 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.