శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి

June 10th, 11:50 pm

హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలం సేవలందించిన

June 10th, 02:08 pm

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వరుసగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాధినేతల నుంచి అభినందన సందేశాలను అందుకుంటున్నారు.

సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన

May 22nd, 09:31 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

May 22nd, 04:11 pm

ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

May 22nd, 01:00 pm

పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

భారత్‌ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు

January 26th, 11:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రపంచ నాయకులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.

సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 24th, 06:33 pm

సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

బీహార్ లోని శివాన్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 01:00 pm

అందరికీ నమస్కారం. బాబా మహేంద్రనాథ్, బాబా హంసనాథ్, సోహగరా ధామ్, తావే భవానీమాత, అంబికా భవానీ మాత, భారత మొదటి రాష్ట్రపతి దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ల పవిత్ర భూమిపై మీ అందరికి హార్దిక స్వాగతం!

బీహార్లోని సివాన్‌లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 20th, 12:00 pm

బీహార్లోని సివాన్లో రూ.5,200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబా మహేంద్రనాథ్, బాబా హన్స్‌నాథ్‌లను స్మరించుకున్నారు. అలాగే పవిత్రమైన సోగర ధామ్‌‌ ప్రాశస్థ్యాన్ని గుర్తుచేశారు. థావే భవానీ మాత, అంబికా భవానీ మాతకు వందనం సమర్పించారు. దేశానికి తొలి రాష్ట్రపతిగా సేవలందించిన దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌‌ను ఆయన గౌరవపురస్సరంగా తలచుకున్నారు.

భారత్, సైప్రస్ దేశాల మధ్య సమగ్ర భాగస్వామ్య అమలుపై సంయుక్త ప్రకటన

June 16th, 03:20 pm

అధికారిక పర్యటన నిమిత్తం రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్‌కు వెళ్లిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులైడ్స్ స్వాగతం పలికారు. సైప్రస్‌లో ప్రధాని జూన్ 15,16 లలో పర్యటిస్తారు. గడచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్‌‌ను సందర్శించడం ఇదే మొదటి సారి. ఈ చరిత్రాత్మక మైలు రాయి.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దృఢమైన స్నేహాన్ని సూచిస్తుంది. ఈ పర్యటన ఉమ్మడి చరిత్రను మాత్రమే కాకుండా.. రెండు దేశాల వ్యూహాత్మక దృక్పథం, పరస్పర నమ్మకం, గౌరవంతో కూడిన భాగస్వామ్య భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తుంది

సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

June 16th, 03:15 pm

భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

June 16th, 01:45 pm

సాదరంగా స్వాగతం పలికి, మంచి ఆతిథ్యమిచ్చిన గౌరవ అధ్యక్షుడికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న సైప్రస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడూ, ఇక్కడి ప్రజలూ చూపిన ఆప్యాయతానురాగాలు నిజంగా నా హృదయాన్ని తాకాయి.

సైప్రస్ లో ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 16th, 01:35 pm

ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానం. ఇది వారి బలానికీ, ఆకాంక్షలకూ గుర్తింపు. ఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి

June 16th, 01:33 pm

సైప్రస్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.

సైప్రస్, భారత వాణిజ్య రంగ ప్రముఖులతో ప్రధానమంత్రి, సైప్రస్ అధ్యక్షుల భేటీ

June 16th, 02:17 am

సైప్రస్ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్‌తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్, భారత్‌ వాణిజ్య రంగ ప్రముఖులతో లిమాసోల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, రక్షణ, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), నౌకావాణిజ్యం, షిప్పింగ్, సాంకేతికత, నవకల్పన, డిజిటల్ సాంకేతికలు, కృత్రిమ మేధ, ఐటీ సర్వీసులు, పర్యటన, రవాణావంటి భిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.

అనువాదం: సైప్రస్‌లో జరిగిన భారత్‌-సైప్రస్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 15th, 11:10 pm

అన్నింటి కంటే ముందుగా ఈరోజు నన్ను స్వయంగా విమానాశ్రయానికి ఆహ్వానించడానికి వచ్చినందుకు అధ్యక్షుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాపార సంస్థల నాయకులతో ఇంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా గురించి, ఇరు దేశాల భాగస్వామ్యం గురించి ఆయన పంచుకున్న సానుకూల ఆలోచనల పట్ల కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను.

సైప్రస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 15th, 06:06 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం సైప్రస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఘన స్వాగతం పలికారు.

సైప్రస్, కెనడా, క్రొయేషియాల్లో పర్యటనకు ముందు ప్రధాని ప్రకటన

June 15th, 07:00 am

సైప్రస్, కెనడా, క్రొయేషియా- మూడు దేశాల పర్యటనకు ఈ రోజు నేను బయలుదేరుతున్నాను.

జూన్ 15 నుండి 19 వరకు సైప్రస్ రిపబ్లిక్, కెనడా మరియు క్రొయేషియాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

June 14th, 11:58 am

ప్రధాని మోదీ జూన్ 15-16 తేదీలలో సైప్రస్‌లో, జూన్ 16-17 తేదీలలో జీ-7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాకు మరియు జూన్ 18న క్రొయేషియాకు వెళతారు. ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో చర్చలు జరుపుతారు మరియు లిమాసోల్‌లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత కెనడాలో, జీ7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రధాని మోదీ జీ-7 దేశాల నాయకులతో అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు. క్రొయేషియాలో, ప్రధాని మోదీ పీఎం ప్లెన్కోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు మరియు క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌తో సమావేశమవుతారు.

సైప్రస్ కు అధ్యక్షుని గా శ్రీ నికోస్ క్రిస్టోడౌలాయిడ్స్ ఎన్నికయినందుకు ఆయనకు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

February 13th, 10:50 pm

సైప్రస్ కు అధ్యక్షుని గా శ్రీ నికోస్ క్రిస్టోడౌలాయిడ్స్ ఎన్నిక అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.