రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం

July 04th, 12:50 pm

ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.

రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 04th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సుస్థిర ఇంధన సామర్థ్యంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన

July 02nd, 10:04 pm

జపాన్ ప్రధానమంత్రి గౌరవ సనాయే తకాయిచితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి దృష్ట్యా... ఆసియాలో బాధ్యతాయుత శక్తులుగా, ప్రధాన ఇంధన వినియోగ దేశాలుగా కలిసి పనిచేయడం ద్వారా సుస్థిర ఇంధన సామర్థ్యాన్ని సంయుక్తంగా బలోపేతం చేసుకోవాలనే తమ ఉమ్మడి ఉద్దేశాన్ని వారు స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 28th, 12:15 pm

ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.

సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 28th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

March 24th, 02:05 pm

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.

పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 24th, 02:00 pm

పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.

అస్సాంలోని గోలాఘాట్ లో పాలీప్రొపిలీన్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 14th, 03:30 pm

భారత్ మాతా కీ జై! ప్రజాదరణ పొందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు సర్బానంద సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా సోదరీసోదరులారా!

అస్సాంలోని గోలాఘాట్‌లో బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం, పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

September 14th, 03:00 pm

హరిత ఇంధనాన్ని ప్రోత్సహించటం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాం రాష్ట్రం గోలాఘాట్‌లోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో (ఎన్ఆర్ఎల్) బయోఇథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనితో పాటు పాలీప్రొపిలీన్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. షరోదియ దుర్గా పూజను పురస్కరించుకొని అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు శ్రీమంత శంకరదేవ్ జయంతి చాలా గొప్పదన్న ఆయన.. పూజ్యులైన గురువులందరికీ నమస్కరిస్తున్నట్లు తెలియజేశారు.

ఢిల్లీలోని యశోభూమి వేదికగా జరిగిన సెమీకాన్ ఇండియా-2025 సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

September 02nd, 10:40 am

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారు, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు, ఎస్ఈఎమ్ఐ అధ్యక్షులు అజిత్ మనోచా గారు, దేశవిదేశాల నుంచి వచ్చిన సెమీ కండక్టర్ పరిశ్రమకు చెందిన సీఈవోలు, వారి సహచరులు, వివిధ దేశాల నుంచి హాజరైన మా అతిథులు, అంకురసంస్థలతో అనుబంధంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నా యువ విద్యార్థి మిత్రులు, సోదరసోదరీమణులారా!

‘సెమీకాన్ ఇండియా 2025’ను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. భారత్‌పై ప్రపంచానికి నమ్మకముంది..

September 02nd, 10:15 am

‘సెమీకాన్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... దేశ విదేశాల నుంచి సెమీకండక్టర్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వారి సహచరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞత‌లు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అతిథులు, అంకుర సంస్థలతో అనుబంధం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ విద్యార్థులకు కూడా ఆయన స్వాగతం పలికారు.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 04:16 pm

ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన మన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఘీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జువాల్ ఓరం, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శ్రీమతి ప్రవతి పరీడా, రాష్ట్ర మంత్రులూ, పార్లమెంటు సభ్యు లూ, శాసనసభ సభ్యులూ, ఇంకా నా ఒడిశా సోదరసోదరీమణులారా!

ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు

June 20th, 04:15 pm

ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భువనేశ్వర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఒడిశా సమగ్ర అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా.. తాగునీరు, నీటిపారుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు-వంతెనలు, జాతీయ రహదారుల విభాగాలు, కొత్త రైల్వే లైన్ పనులు సహా కీలక రంగాలకు సంబంధించి, రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.

అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

May 23rd, 11:00 am

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్‌ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!

రైజింగ్ నార్త్ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు-2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

May 23rd, 10:30 am

రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇథనాల్ కలిపిన పెట్రోలు (ఈబీపీ) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీస్) ఇథనాల్ సేకరణ పద్ధతికి మంత్రి మండలి ఆమోదముద్ర

January 29th, 03:04 pm

ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై) 2024-25కుగాను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ)కు ఇథనాల్ కొనుగోలు ధరను సవరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇథనాల్ సరఫరా నవంబరు 1, 2024న ప్రారంభమై, అక్టోబరు 31, 2025తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రిత పెట్రోల్ (ఈబీపీ) విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ ‌ను కొనుగోలు చేయాలి. దీనికి అనుగుణంగా, సీ హెవీ మొలాసెస్ (సీహెచ్ఎం) నుంచి తయారు చేసిన ఇథనాల్‌కు ఈబీపీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రించిన మిల్లు ధర 2024-25 ఏడాదికి (2024 నవంబరు 1 నుంచి 2025 అక్టోబరు 31 మధ్య కాలానికి) లీటరు ఒక్కింటికి రూ.56.58 నుంచి రూ.57.97గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha

September 20th, 11:45 am

PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.

మ‌హారాష్ట్ర‌, వార్ధాలో నిర్వ‌హించిన జాతీయ పీఎం విశ్వ‌క‌ర్మ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

September 20th, 11:30 am

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లోని వార్ధాలో నిర్వ‌హించిన‌ జాతీయ పీఎం విశ్వ‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాల‌ను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్య‌క్ర‌మం కింద‌ ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్ర‌ధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న‌ పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర‌) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రధాని తిలకించారు.

Our government is committed to development of the Northeast: PM Modi

March 09th, 11:09 am

PM Modi addressed Viksit Bharat Viksit North East Program in Itanagar, Arunachal Pradesh. Reiterating his vision of ‘Ashtalakshmi’ for the development of the Northeast, the Prime Minister called the region a strong link of tourism, business and cultural relations with South and Southeast Asia.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో వికసిత్ భారత్, వికసిత్ ఈశాన్యం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 09th, 10:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో వికసిత్ భారత్, వికసిత్ ఈశాన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లలో చేపట్టనున్న రూ.55,600 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి కొన్నింటిని శ్రీ మోదీ ప్రారంభించారు. అలాగే సెలా సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రూ.10,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఉన్నతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల్లో రైలు, రోడ్డు, ఆరోగ్యం, గృహ నిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక వసతులు, ఐటి, విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాల ప్రాజెక్టులున్నాయి.