అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతలైన భారత అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి విందు
November 27th, 10:03 pm
అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారతీయ అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆతిథ్యాన్ని ఇచ్చారు. మహిళా క్రీడాకారులతో శ్రీ మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఆటల పోటీలో తమకు కలిగిన అనుభవాలను మహిళా క్రీడాకారులు వివరించారు.తొలి అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందన
November 24th, 12:23 pm
తొలి అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.అనువాదం: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:15 am
ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ దేవ్ దీపావళి.. గురుపూర్ణిమ కూడా. అందుకే ఇది నిజంగా చాలా ముఖ్యమైన రోజు.ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని లోకకల్యాణ్ మార్గ్, 7లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఛాంపియన్లతో నిన్న ముచ్చటించారు. 2025 నవంబర్ 2, ఆదివారం జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది. దేవ దీపావళి, గురు పర్వ్ రెండింటినీ నిర్వహించుకొనే ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
November 03rd, 11:00 am
ఈరోజు జరిగే కార్యక్రమం సైన్స్‌కు సంబంధించింది. అయితే ముందుగా నేను క్రికెట్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతాను. యావత్ భారతం తమ క్రికెట్ జట్టు విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఇది భారత మహిళల జట్టుకు మొట్టమొదటి ప్రపంచ కప్. మన మహిళా క్రికెట్ జట్టును నేను అభినందిస్తున్నాను. మేం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. మీ విజయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 03rd, 10:30 am
ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్‌టీఐసీ) 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధనా సంస్థల సభ్యులు, ఇతర విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ఐసీసీ మహిళ ప్రపంచ కప్ 2025లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన విజయంతో దేశమంతా ఆనందంతో ఉప్పొంగిపోయిందన్నారు. తొలిసారి భారత్ మహిళా ప్రపంచ కప్ గెలిచిందంటూ.. దీన్ని సాధించిన మహిళల జట్టుకు అభినందనలు తెలియజేశారు. వారిని చూసి దేశం గర్విస్తోందని, వారు సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు.నవ రాయ్‌పూర్‌లోని సత్యసాయి సంజీవని పిల్లల గుండెజబ్బు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న బాలలతో ప్రధానమంత్రి మాటామంతీ
November 01st, 05:30 pm
సర్... నేను హాకీ ఛాంపియన్‌ని. ఇప్పటిదాకా 5 పతకాలు సాధించాను. మా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించినపుడు నా గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధరించారు. ఆ తర్వాత ఈ ఆస్పత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నాను. నేనిప్పుడు మళ్లీ హాకీ మైదానంలో ప్రతిభ చూపగలను.పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులను జయించిన పిల్లలతో ప్రధానమంత్రి ముఖాముఖి
November 01st, 05:15 pm
'దిల్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో జరిగిన ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల నుంచి విజయవంతంగా కోలుకున్న 2500 మంది పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు.'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఆసియా కప్-2025లో భారతీయ క్రికెట్ జట్టు గెలుపు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
September 29th, 12:30 am
ఆసియా కప్ -2025లో అఖండ విజయాన్ని సాధించిన భారతీయ క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా అభినందనలు తెలిపారు.ఫిజీ ప్రధాని శ్రీ సిటీవేనీ రాబుకా భారత్ పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
August 25th, 01:58 pm
ఫిజీలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూపకల్పన, నిర్మాణం, కార్యకలాపాల ప్రారంభం, నిర్వహణ, మరమ్మతుల కోసం భారత్ ప్రభుత్వానికీ, ఫిజీ ప్రభుత్వానికీ మధ్య అవగాహన ఒప్పంద పత్రం.ఫిజీ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంగ్లిషు పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
August 25th, 12:30 pm
ఆ కాలంలో, మనం ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కోఆపరేషన్‌ను (ఎఫ్ఐపీఐసీ) ప్రారంభించాం. ఈ కార్యక్రమం భారత్-ఫిజీ సంబంధాల్ని పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండా, పూర్తి పసిఫిక్ రంగంతో మన బంధాలకు ఒక కొత్త శక్తిని కూడా అందించింది. ఈ రోజున, ప్రధాని శ్రీ రాబుకా పర్యటనతో మన సంబంధాలకు ఒక నూతన అధ్యాయాన్ని జత చేస్తున్నాం.బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
July 24th, 04:20 pm
ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.బ్రెజిల్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
July 08th, 08:30 pm
రియో, బ్రెజీలియాలో ఆత్మీయ స్వాగతం పలికిన నా స్నేహితుడు, అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెజాన్ ప్రకృతి సౌందర్యం, మీ ఆత్మీయత మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 09:30 pm
గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 04th, 09:00 pm
ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.PM Modi conferred with highest national award, the ‘Order of the Republic of Trinidad & Tobago
July 04th, 08:20 pm
PM Modi was conferred Trinidad & Tobago’s highest national honour — The Order of the Republic of Trinidad & Tobago — at a special ceremony in Port of Spain. He dedicated the award to the 1.4 billion Indians and the historic bonds of friendship between the two nations, rooted in shared heritage. PM Modi also reaffirmed his commitment to strengthening bilateral ties.యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశిని కలిసిన ప్రధాని
May 30th, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ‘‘అతడి క్రికెట్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి! భవిష్యత్ ప్రయత్నాల దిశగా అతడికి నా శుభాకాంక్షలు’’ అని శ్రీ మోదీ అన్నారు.గాంధీనగర్‌లో ‘రెండు దశాబ్దాల గుజరాత్ పట్టణ ప్రగతి పథం’ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 27th, 11:30 am
ఈ వేదికనలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన నా ప్రియ సోదరీసోదరులారా!గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల ఉత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 27th, 11:09 am
గుజరాత్ పట్టణాభివృద్ధిని చాటే 20 ఏళ్ల వేడుకనుద్దేశించి గాంధీనగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. పట్టణాభివృద్ధి సంవత్సరం- 2005కు ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణాభివృద్ధి సంవత్సరం-2025ను ఆయన ప్రారంభించారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. వడోదర, దాహోద్, భుజ్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయ గర్జనలు, రెపరెపలాడుతున్న మువ్వెన్నెల పతాకాలతో వెల్లివిరుస్తున్న దేశభక్తిని రెండు రోజులుగా ఆస్వాదిస్తున్నానన్నారు. ఈ కనువిందైన దృశ్యం ఒక్క గుజరాత్‌కే పరిమితం కాలేదనీ.. భారత్ నలుమూలలా, ప్రతి భారతీయుడి హృదయమూ ఇదే రకమైన భావనతో ఉప్పొంగుతోందని ఆయన పేర్కొన్నారు. “ఉగ్రవాదమనే కంటకాన్ని నిర్మూలించాలని సంకల్పించిన భారత్ దృఢ నిశ్చయంతో దానిని నెరవేర్చింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.