2023-24 సీజన్‌కు సీసీఐకి రూ. 1,718.56 కోట్ల ఎంఎస్‌పీ నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం... పత్తి రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం
March 18th, 04:08 pm
రైతు సంక్షేమాన్ని బలోపేతం చేస్తూ, ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధన దిశగా పురోగమించేలా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 పత్తి సీజనుకు గాను భారత పత్తి సంస్థకు రూ.1,718.56 కోట్ల కనీస మద్దతు ధర నిధులను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. మద్దతు ధరతో దేశవ్యాప్తంగా ఉన్న పత్తి రైతులకు అండగా నిలవడం ఈ నిధుల ముఖ్యోద్దేశం.