న్యూ ఢిల్లీ లో 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 29వ తేదీ నాడు జ‌రుగ‌నున్న ‘కాన్ఫ‌రెన్స్ ఆన్ అకాడెమిక్ లీడ‌ర్‌శిప్ ఆన్ ఎడ్యుకేష‌న్ ఫ‌ర్ రిస‌ర్జ‌న్స్’ ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

September 28th, 12:24 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘కాన్ఫ‌రెన్స్ ఆన్ అకాడెమిక్ లీడ‌ర్‌శిప్ ఆన్ ఎడ్యుకేష‌న్ ఫ‌ర్ రిస‌ర్జ‌న్స్’ ను 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 29వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ప్రారంభించ‌నున్నారు. ఈ స‌మావేశం లో 350 కి పైగా విశ్వ‌విద్యాల‌యాల ఉప కుల‌ప‌తులు/స‌ంచాల‌కులు పాలుపంచుకోనున్నారు. యుజిసి, ఎఐసిటిఇ, ఐసిఎస్ఎస్ఆర్‌, ఐజిఎన్‌సిఎ, ఐజిఎన్ఒయు, జెఎన్‌యు ల‌తో పాటు ఎస్‌జిటి యూనివ‌ర్సిటీ లు కలసి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాయి.