కామన్వెల్త్ దేశాల లోక్‌సభల స్పీకర్లు, అధ్యక్షుల 28వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
January 15th, 11:00 am
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, అంతర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు శ్రీమతి టూలియా అక్సన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ క్రిస్టోఫర్ కలిలా, కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, అధ్యక్లులు, ఇతర ప్రతినిధులు, సోదరసోదరీలారా!రాజ్యాంగ సౌధం సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు.. ప్రిసైడింగ్ ఆఫీసర్ల 28వ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
January 15th, 10:32 am
న్యూఢిల్లీలోని ‘రాజ్యాంగ సౌధం’లోని సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు-ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును (సీఎస్‌పీఓసీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర ఎంతో విశిష్టమైనదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా చట్టసభల స్పీకర్లకు మాట్లాడే అవకాశం అంతగా ఉండదంటూ- ఇతరులు చెప్పేది వినడం, ప్రతి ఒక్కరి అభిప్రాయ వెల్లడికి అవకాశమివ్వడం వారి బాధ్యతని పేర్కొన్నారు. అత్యుత్సాహం చూపే, వివాదాస్పదంగా వ్యవహరించే సభ్యులను కూడా చిరునవ్వుతో నిభాయించే స్పీకర్లలో సహనం అత్యంత సార్వత్రిక లక్షణమని అభివర్ణించారు.కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని జనవరి 15న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
January 14th, 11:19 am
కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని (సీఎస్‌పీఓసీ) న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన సముదాయంలో గల సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 2026 జనవరి 15న ఉదయం 10:30కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.