భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన

May 19th, 04:25 pm

ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన

May 15th, 03:59 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.

సంయుక్త ప్రకటన: యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ భారతదేశ పర్యటన

January 19th, 08:10 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించారు. గత దశాబ్ద కాలంగా భారత్-యూఏఈ 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతూనే ఉందని ఇద్దరు నాయకులు పేర్కొన్నారు.

ఒమన్ సుల్తాన్ తో ప్రధానమంత్రి సమావేశం

December 18th, 05:22 pm

ఒమన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మస్కట్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‌ వద్ద ప్రధానమంత్రికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సాదర స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో కూడిన ఘనమైన స్వాగత కార్యక్రమం నిర్వహించారు.