భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందమూ, సామాజిక భద్రతా ఒప్పందాలపై కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

July 15th, 12:58 pm

భారత్ - బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా), సామాజిక భద్రతా ఒప్పందాలపై కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. భారత్ - బ్రిటన్ భాగస్వామ్యంలో ఇదొక కీలక విజయంగా అభివర్ణించారు. భారత్ - బ్రిటన్ ఆర్థిక సంబంధాలను ఈ రెండు ఒప్పందాలూ మరింత బలోపేతం చేస్తాయనీ, ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ఆయా దేశాల ప్రజలకు స్పష్టమైన అవకాశాలుగా మలుస్తాయనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని

June 17th, 10:03 pm

2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

October 09th, 11:25 am

భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.