బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
September 25th, 06:44 pm
బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ను సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి బీహార్ వ్యాప్తంగా 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 18th, 11:15 am
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.Prime Minister Narendra Modi addresses the G7 Outreach Session
June 18th, 11:13 am
PM Modi participated in the Outreach Session of the G7 Summit in Kananaskis and addressed a Session on 'Energy Security.' The PM highlighted that energy security was among the leading challenges facing future generations. While elaborating on India's commitment to inclusive growth, he noted that availability, accessibility, affordability and acceptability were the principles that underpinned India's approach to energy security.సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
April 22nd, 08:30 am
యువరాజు, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సౌదీ బయలుదేరి వెళుతున్నాను.ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 09:36 pm
నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం
January 28th, 09:02 pm
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు.. ప్రస్తావించిన ప్రధానమంత్రి
January 22nd, 10:04 am
‘బేటీ బచావో, బేటీ పఢావో’ (ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి) ఉద్యమానికి నేటితో పది సంవత్సరాలు పూర్తి అయిన సంగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ మార్పులకు దారితీసిందని, ప్రజల అండదండలే దీనిని ముందుకు నడిపిస్తున్నాయని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రధాని అన్నారు. బాలురు, బాలికల విషయంలో పక్షపాత భావనను దూరం చేయడంలో, బాలికలకు సాధికారతను కల్పించడంలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం తోడ్పడిందని ఆయన ప్రధానంగా చెప్పారు. బాల బాలికల నిష్పత్తి తక్కువ స్థాయిల్లో ఉంటూ వస్తున్న జిల్లాల్లో ఈ ఉద్యమం అమలుతో గణనీయ ఫలితాలు వచ్చాయని కూడా శ్రీ మోదీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని చక్కగా కొనసాగించడంలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ఆయన అభినందించారు.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్ లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
January 03rd, 08:30 pm
లబ్ధిదారు: అవును సర్, దొరికింది. మీకు మేం చాలా కృతజ్ఞులమై ఉంటాం. గుడిసెలో నుంచి మంచి చోటుకు మమ్మల్ని తీసుకువచ్చారు మీరు. ఇంత మంచి చోటు దొరుకుతుందని మేం ఎన్నడూ అనుకోలేదు, మా కలను మీరు నిజం చేశారు.. అవును, సర్.స్వాభిమాన్ గృహ సముదాయం లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
January 03rd, 08:24 pm
‘అందరికీ ఇల్లు’ అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ గృహసముదాయంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సందర్శించారు. యధాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్లలోని నివాసితుల కోసం వీటిని నిర్మించారు. స్వాభిమాన్ అపార్ట్మెంట్ల లబ్ధిదారులతో ప్రధాని శ్రీ మోదీ ముచ్చటించారు.బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 19th, 05:41 am
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:35 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:30 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.పదేళ్లు పూర్తి చేసుకున్న స్వచ్ఛ భారత్: యువతతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 04:40 pm
స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ప్రారంభించి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీలో బడి పిల్లలతో పాటు పరిశుభ్రతా పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛత వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పండంటూ ప్రశ్నించారు. దాని వల్ల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని ఒక విద్యార్థి జవాబిస్తూ.. స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకోవాలనే అవగాహనను మన ఇరుగు పొరుగులలో వ్యాప్తి చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నాడు. మరుగుదొడ్లు లేని కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని మరో విద్యార్థి చెప్పాడు. చాలా మంది బహిర్భూమికి బహిరంగ ప్రదేశాలను ఎంచుకోక తప్పనిసరైన స్థితి ఇది వరకు ఉండేదని, దీంతో రోగాలు పుట్టల్లా పెరిగాయని, మహిళలు చెప్పరాని అవస్థలు పడ్డారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పాఠశాలల్లో బాలికల కోసం విడిగా మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ్ భారత్ అభియాన్ తొలి అడుగులు పడ్డాయని, బడికి వెళ్లడం మానేస్తున్న అమ్మాయిల సంఖ్యఫ్రాన్స్ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
July 13th, 11:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ ప్రధాని ఎలిజాబెథ్ బోర్న్ గారి తో 2023 జులై 13 వ తేదీ నాడు సమావేశమయ్యారు.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.శతాబ్దాల నాటి గుజరాత్.. తమిళనాడు బంధాన్ని ‘ఎస్‌టి సంగమం’ బలోపేతం చేస్తోంది: ప్రధానమంత్రి
March 26th, 10:49 am
గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల మధ్య శతాబ్దాల కిందట ఏర్పడిన బంధాన్ని సౌరాష్ట్ర-తమిళనాడు సంగమం (‘ఎస్‌టి’ సంగమం) నేడు మరింత బలోపేతం చేస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సౌరాష్ట్ర-తమిళనాడు సమ్మేళనం వేడుకల్లో భాగంగా తమిళనాడులోని సేలంలో దాండియా నృత్య ప్రదర్శనను తిలకించినట్లు కేంద్ర రైల్వేలు-జౌళి శాఖ సహాయమంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో తనతోపాటు (గుజరాత్) రాష్ట్ర మంత్రిమండలిలో సహాయమంత్రి శ్రీ జగదీష్ విశ్వకర్మ కూడా పాల్గొన్నారని అందులో తెలిపారు.జూన్ 3న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
June 02nd, 03:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 3వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు ఉదయం 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి లఖ్ నవూ లోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్ కు చేరుకొని, అక్కడ ‘యుపి ఇన్ వెస్టర్స్ సమిట్’ లో భాగం గా జరిగే భూమి పూజ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం 1:45 నిమిషాల కు ప్రధాన మంత్రి కాన్ పుర్ లోని పరౌంఖ్ గ్రామాని కి వెళ్తారు. అక్కడ మాన్య రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ తో భేటీ అవుతారు. ఇరువురు పత్రి మాత మందిరాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటల వేళ కు వారు ఉభయులు డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ భవన్ కు చేరుకొంటారు. మధ్యాహ్నం 2:15 నిమిషాల కు మిలన్ కేంద్ర కార్యక్రమం ఉంటుంది. ఈ కేంద్రం మాన్య రాష్ట్రపతి పూర్వికుల ఇల్లు. దీని ని ప్రజల ఉపయోగార్థం విరాళం గా ఇవ్వడమైంది. ఒక సాముదాయిక కేంద్రం (మిలన్ కేంద్ర) గా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు వారు పరౌంఖ్ గ్రామం లో జరిగే ఒక జన సభ కు హాజరు అవుతారు.పెద్దగా ఆలోచించండి, పెద్దగా కలలు కనండి మరియు వాటిని సాకారం చేయడానికి కష్టపడండి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 26th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను. బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.