2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా
January 27th, 06:48 pm
2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన
January 27th, 06:15 pm
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి
December 17th, 12:02 am
పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 18th, 11:15 am
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.Prime Minister Narendra Modi addresses the G7 Outreach Session
June 18th, 11:13 am
PM Modi participated in the Outreach Session of the G7 Summit in Kananaskis and addressed a Session on 'Energy Security.' The PM highlighted that energy security was among the leading challenges facing future generations. While elaborating on India's commitment to inclusive growth, he noted that availability, accessibility, affordability and acceptability were the principles that underpinned India's approach to energy security.అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
May 03rd, 01:00 pm
గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.సౌదీ అరేబియాలో ప్రధాని అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా సంయుక్త ప్రకటన
April 23rd, 12:44 pm
గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 22న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు.టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.ఆస్ట్రియా ఛాన్సలర్ తో కలిసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉమ్మడి పత్రికా ప్రకటన
July 10th, 02:45 pm
హృదయ పూర్వక స్వాగతాన్ని పలికి, ఆతిథ్యమందించినందుకు మొట్టమొదటగా ఛాన్సలర్ నెహమర్ కు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ పర్యటన చారిత్రాత్మకమైనది, ప్రత్యేకమైనది. 41 సంవత్సరాల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న భారతీయ ప్రధానిగా నాకు గుర్తింపు లభించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేను పర్యటించడం కాకతాళీయం, సంతోషకరం.2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసం
November 17th, 04:03 pm
2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సమావేశానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21 వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక. భౌగోళికంగా, గ్లోబల్ సౌత్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. కానీ ఇలాంటి వాయిస్ రావడం ఇదే తొలిసారి. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మేము 100 కంటే ఎక్కువ వేర్వేరు దేశాలను కలిగి ఉన్నాము, కానీ మాకు ఒకే రకమైన ప్రయోజనాలు మరియు ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.