భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతమైన వేగంతో పురోగమిస్తున్నాయన్న ప్రధానమంత్రి
June 05th, 05:10 pm
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. భారత్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా ఆయన అన్నారు.గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
February 28th, 02:45 pm
గుజరాత్ ప్రజల ఆదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారూ, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా గారూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి గారూ, విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా...గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 02:37 pm
గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభాన్ని సూచించే ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ సాంకేతిక నాయకత్వం వైపు భారత్ భారత ప్రయాణంలో ఒక ముందడుగు.హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 19th, 11:30 am
వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో జరుపుకొంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, డబ్ల్యుఐటిఎస్ఎ, ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ల భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు.