న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

July 11th, 01:15 pm

‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.

న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

July 11th, 12:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.

సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 05:00 pm

ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

June 14th, 04:36 pm

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నొవేట్స్-2026’కు శ్రీకారం

June 14th, 03:00 pm

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలోగల విశాల ఎగ్జిబిషన్‌ కేంద్రం (పాలైస్ డెస్ ఎక్స్‌పొజిషన్స్‌)లో ఇవాళ “భారత్ ఇన్నొవేట్స్-2026”ను సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణ పెట్టుబడి సంస్థలు, అవకాశాల దిశగా భారత డీప్-టెక్ అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక వేదికపైకి తెస్తుంది. అంతర్జాతీయ ప్రాధాన్యంగల 13 కీలక సాంకేతిక రంగాల్లో 120కి పైగా వినూత్న అంకుర సంస్థలను, 20కి పైగా అగ్రశ్రేణి నైపుణ్య సంస్థలు సహా భారత అగ్రశ్రేణి డీప్ టెక్నాలజీని ప్రపంచానికి ఈ వేదిక చాటిచెబుతుంది. ప్రపంచంలోని 350 మందికి పైగా అగ్రశ్రేణి పెట్టుబడిదారులు, వెంచర్ కేపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 05th, 04:30 pm

విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!

గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 05th, 04:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్‌ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

3వ ఇండియా-నార్డిక్ సదస్సు సందర్భంగా డెన్మార్క్ తాత్కాలిక ప్రధాన మంత్రితో సమావేశమైన భారత ప్రధాన మంత్రి

May 19th, 06:40 pm

ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించిన ఉభయ దేశాల నాయకులు, ఉమ్మడి కార్యాచరణలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, వాతావరణ మార్పుల రంగాల్లో సహకారానికి ప్రాధాన్యతనిస్తూ రెండు దేశాల్లో హరిత పరివర్తనకు తోడ్పడేలా ఉమ్మడి ప్రయత్నాలను ఏకీకృతం చేసే 'భారత్-డెన్మార్క్ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం’ సాధించిన పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2020లో ఈ హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న ఉన్నత స్థాయి పర్యటనలు, చర్చలను గుర్తుచేసిన ఇరు దేశాల నాయకులు.. సరికొత్త- వర్ధమాన సాంకేతికతలు, కమ్యూనికేషన్స్, అధునాతన పరిశోధనలు, అంకురాలు, విద్యాసంబంధ మార్పిడి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారంపై కూడా వారు చర్చించారు. గుజరాత్‌లోని 'గిఫ్ట్ సిటీ'లో తమ కార్యకలాపాలను ప్రారంభించాల్సిందిగా డెన్మార్క్ కంపెనీలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

నార్వే ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు

May 18th, 08:21 pm

నార్వే రాజధాని ఓస్లోలో ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ జోనాస్ గర్ స్టోరెతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఓస్లో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీ మోదీకి నార్వే ప్రధానమంత్రి స్టోరె స్వయంగా విచ్చేసి ఘనస్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు అద్దం పట్టింది.

అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన

May 17th, 11:43 pm

కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రసంగం

May 10th, 09:35 pm

ప్రధాని మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. గుజరాత్ సాధించిన అద్భుతమైన అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, కేవలం ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం, ఇప్పుడు సెమీకండక్టర్లు, మెట్రో కోచ్‌లు, రైల్వే ఇంజన్లు, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న విమానయాన తయారీ రంగాలకు కేంద్రంగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. రాష్ట్రం యొక్క నిరంతర వృద్ధి, పురోగతికి గుజరాత్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలే కారణమని ఆయన కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం

May 05th, 07:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇవాళ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో రూ.23,437 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో:

సుస్థిరాభివృద్ధిలో సహకారానికి భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్త ప్రకటన

April 20th, 10:55 pm

వాతావరణ మార్పులు, సముద్ర, ఆర్కిటిక్ అంశాల్లో ఆచరణాత్మక సహకారం ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి సవాళ్ల పరిష్కారానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా ప్రకటించారు.

భారత్‌లో కొరియా రిపబ్లిక్ అధ్యక్షుని అధికారిక పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు

April 20th, 03:57 pm

భారత్-కొరియా రిపబ్లిక్ (ఆర్ఓకే) ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త వ్యూహాత్మక దృష్టి కోణం.

Today, BJP stands for good governance and last-mile delivery: PM Modi

April 06th, 12:30 pm

PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.

PM Modi addresses Party Karyakartas on BJP Sthapana Diwas

April 06th, 12:00 pm

PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.

జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు

March 25th, 05:35 pm

భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.

ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్‌-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన

March 05th, 08:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్‌ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్‌ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్‌ ఇప్పుడు పర్యటిస్తున్నారు.