జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

June 17th, 11:54 pm

కెనడాలో కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు డాక్టర్ క్లౌడియా షైన్‌బామ్ పార్డోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నేతలు ఇద్దరూ సమావేశం కావడం ఇదే మొదటి సారి. మెక్సికో అధ్యక్షురాలి చరిత్రాత్మక గెలుపును దృష్టిలో పెట్టుకొని, ప్రధానమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు.