భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి నివాళులు
April 10th, 08:44 am
మహావీర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భగవాన్ మహావీర్ సదా అహింసకూ, సత్యానికీ, కరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీ, ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీ, ఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.పాళీ భాషలో త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
April 03rd, 05:43 pm
పాళీలో ఉన్న త్రిపీటకాల ప్రతిని అందించినందుకు థాయ్ లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి పేతోంగ్‌తార్న్ షినవత్రకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పాళీ అందమైన భాష అని, అది బుద్ధ భగవానుడి బోధనల సారాంశాన్ని కలిగివుందని ఆయన ప్రశంసించారు.భాషా గౌరవ్ సప్తాహ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
November 03rd, 06:14 pm
అసోం ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, భాషా గౌరవ్ సప్తాహ్ ( #BhashaGauravSaptah) ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానంగా పేర్కొన్నారు. సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని ఇస్తూ, అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇటీవలే ప్రకటించిన సంగతిని గుర్తుకు తీసుకు వచ్చారు. ఈ హోదా తో, భాష పరంగా, సాంస్కృతిక వారసత్వం పరంగా అసోం ప్రాంతానికి ఉన్న సంపన్నతకు ముఖ్య గుర్తింపు దక్కింది. దీంతో సర్వత్రా ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్దుని బోధనలు విశ్వసించే వారిలో ఆనందాన్ని నింపింది: ప్రధాన మంత్రి
October 24th, 10:43 am
పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు నింపుతుందని అన్నారు. కొలంబోలో ఐసీసీఆర్ నిర్వహించిన ‘ప్రాచీన భాషగా పాళీ’ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పండితులు, బౌద్ధ భిక్షువులకు ధన్యవాదాలు తెలిపారు.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:05 am
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:00 am
అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.అక్టోబర్ 17న జరిగే అంతర్జాతీయ అభిధామ్ దివస్ వేడుకలు, శాస్త్రీయ భాషగా పాళీని గుర్తించే కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
October 15th, 09:14 pm
అక్టోబర్ 17 న జరిగే అంతర్జాతీయ అభిధామ్ దివస్ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ వేడుకలు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో పాళీ భాషను శాస్త్రీయ భాషగా గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు.