Prime Minister shares Sanskrit Subhashitam highlighting the strength of courage and resilience

July 08th, 07:48 am

PM Modi shared a Sanskrit Subhashitam emphasising that courage is a nation's greatest strength. He said steadfast resolve enables the country to remain united through challenges and continue progressing towards prosperity and self-reliance.

Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!

July 05th, 03:55 pm

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, July 26th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 28th, 11:30 am

ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.

జూన్ 28న 'మన్ కీ బాత్' వినండి

June 27th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

June 21st, 10:00 pm

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను నిజమైన ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

మే 31న 'మన్ కీ బాత్' వినడానికి ట్యూన్ ఇన్ చేయండి

May 30th, 08:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

‘వినమ్రత.. క్షమాగుణం.. సదాచరణ’ల వైశిష్ట్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

May 29th, 08:45 am

ఉత్తమ మానవుడి వ్యక్తిత్వానికి ‘వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’లే నిజమైన ఆభరణాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా ‘వికసిత్ భారత్’ సంకల్ప సాకారానికి దేశ ప్రజలు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.

Cabinet approves integration and continuation of two schemes under umbrella scheme SARTHAK-PDS

May 27th, 02:53 pm

The Cabinet Committee on Economic Affairs (CCEA), chaired by PM Modi, has approved the continuation of SARTHAK PDS as an umbrella scheme with a Central outlay of ₹25,530 crore. Equipped with advanced technologies such as AI, ML, NLP and Blockchain, the scheme aims to ensure last-mile service delivery, minimize leakages and strengthen the nation’s commitment to food security under the NFSA.

భారత్ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి

May 27th, 11:21 am

దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతున్న నేపథ్యంలో సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

సత్యం, పట్టుదల విలువను తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

May 05th, 09:47 am

అలుపెరగని కృషితో, సత్య మార్గంలో పయనించడం ద్వారా సాధించిన విజయం శాశ్వతమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గొప్ప మానసిక సంతృప్తిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

26 ఏప్రిల్ 26న జరిగే మన్ కీ బాత్ వినడానికి ట్యూన్ చేయండి

April 25th, 08:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

ప్రధాని మోదీ హౌరా రోడ్‌షోకు పోటెత్తిన జనసందోహం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి రికార్డు స్థాయి విజయం ఖాయమని సంకేతమిస్తోంది.

April 23rd, 07:30 pm

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోలో, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. టీఎంసీ (టిఎంసి) సాగించిన 15 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనకు భిన్నంగా, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న సమ్మిళిత పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ అద్భుత స్పందన నిదర్శనంగా నిలుస్తోంది.

ఇది చార్‌ధామ్ యాత్రా సమయం... శ్రీ కేదార్‌నాథ్ ఆలయం ఎదురు చూస్తోందన్న ప్రధానమంత్రి

April 22nd, 11:28 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన భక్తితత్పరతను వ్యక్తీకరిస్తూ భక్తకోటికి ఒక లేఖ రాశారు. ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్ర మొదలైందని, దేవభూమి ఉత్తరాఖండ్‌లోని శ్రీ కేదార్‌నాథ్ ధామ్ తలుపులను తెరిచారనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. యాత్రలో పాలుపంచుకోవడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న భక్తులను ఉద్దేశించి ఆయన ఒక లేఖను రాస్తూ, వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ నాగర్‌కోయిల్ రోడ్‌షోకు భారీ స్పందన, తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ-ఎన్డీఏకు పెరుగుతున్న మద్దతుకు సంకేతం

April 15th, 05:32 pm

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్‌షోలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అఖండ స్పందన, బీజేపీ-ఎన్డీఏ సమ్మిళిత పాలనకు పెరుగుతున్న ఆమోదాన్ని ప్రతిబింబించడంతో పాటు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణాన్ని కూడా సూచిస్తోంది.

'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

March 29th, 11:30 am

ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

మార్చి 29, 2026న మన్ కీ బాత్ వినడానికి ట్యూన్ చేయండి

March 28th, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

దృఢ సంకల్పం, సంయమనం, ఆత్మవిశ్వాసం.. ఈ విలువలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 09th, 09:33 am

జీవితంలో విజయ సాధనకు కీలకం దృఢ సంకల్పం, సంయమనంతో పాటు ఆత్మవిశ్వాసాల కలయిక కీలకమని టీమ్ ఇండియా టీ20 క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకొని నిరూపించిందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. సరైన దిశగా నిరంతర శ్రమ చేస్తూ ఉంటే ప్రతి లక్ష్యాన్నీ సాధించడం సాధ్యపడుతుందని కూడా ఈ విజయం రుజువు చేసిందని ఆయన అన్నారు.

జన్ ఔషధీ దినోత్సవం - 2026 సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

March 07th, 10:15 am

ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికీ.. జన్ ఔషధీ దినోత్సవం- 2026 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన ఔషధాలు అందుబాటు ధరలకే ప్రతి పౌరుడికీ అందేలా చూడాలన్న తమ అంకితభావానికి ఈ కార్యక్రమం నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ఎన్నో కుటుంబాలు తమ ఆరోగ్య రక్షణ ఖర్చులను ఆదా చేసుకుంటూ, సరైన చికిత్స పొందుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు.