న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
July 11th, 01:15 pm
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
July 11th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.అధికారిక విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 11th, 12:32 pm
గతేడాది భారత్‌లో ప్రధాని లక్సన్ చేపట్టిన పర్యటన.. మన ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని అంశాల్లోనూ కొత్త శక్తిని నింపింది. ఆయన నాయకత్వమూ, స్పష్టమైన దార్శనికతా, దృఢమైన అంకితభావమూ.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహానికి కొత్త వేగాన్నీ, నూతన దిశనూ అందించాయి. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నాకంటే ముందు వచ్చిన వారు నా కోసం ఎన్నో మంచి పనులను వదిలి వెళ్లారు. వాటిని పూర్తి చేసే భాగ్యం నాకు దక్కిందని నేను తరచూ చెబుతూ ఉంటాను. మిత్రులారా, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది.''భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం'' ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధాని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి
July 11th, 12:30 pm
భారత్-న్యూజిలాండ్: ఒక విజయవంతమైన భాగస్వామ్యం ఇతివృత్తంతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ హాజరయ్యారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, క్రీడా, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్-న్యూజీలాండ్ వాణిజ్య కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 11th, 08:20 am
నేటి ఈ సమావేశానికి మీరంతా హాజరు కావడం న్యూజీలాండ్ వాణిజ్య, ఆవిష్కరణల స్ఫూర్తిని, దూరదృష్టి గల విధానాలను ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మా 140 కోట్ల మంది ప్రజల ఆశలు-ఆకాంక్షలను నాతోపాటు తెచ్చాను.Prime Minister addresses business leaders in New Zealand
July 11th, 08:16 am
PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
July 11th, 08:09 am
ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
July 11th, 08:03 am
చర్చలు, సమన్వయం, సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా ఇండో-పసిఫిక్‌లో మెరుగైన నౌకా వాణిజ్య సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది.భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
July 11th, 07:59 am
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.అనువాదం: భారత - న్యూజిలాండ్ ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 11th, 07:00 am
రాత్రంతా మీ మంత్రి గారు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ఆర్థిక రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అవకాశాన్ని మీరు కల్పించారు. దీనికి నేను మీకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఆక్లాండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
July 10th, 02:56 pm
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి, ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఘన స్వాగతం పలికారు.ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
July 06th, 09:00 am
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 03rd, 08:42 pm
ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. మే 2018లో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత, ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది నాలుగోసారి కాగా... ఇది ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, ఇండేనేషియా అధ్యక్షులు శ్రీ ప్రబోవోతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే భారీ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య చరిత్రాత్మక, ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు అనుగుణంగా... ఇండోనేషియాలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ చారిత్రక ఘట్టం: ప్రధానమంత్రి
April 27th, 05:32 pm
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) రెండు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రక ఘట్టమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు.న్యూజిలాండ్ ప్రధానితో టెలిఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి
December 22nd, 11:26 am
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రాత్మకమైన, లక్ష్యపూరితమైన, భారత్-న్యూజిలాండ్‌కు పరస్పరం ప్రయోజనాలు అందించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విజయవంతంగా పూర్తయిందని నాయకులిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.PM Modi expresses gratitude to world leaders for birthday wishes
September 17th, 03:03 pm
The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.భారతదేశంపై ఈ వారం ప్రపంచం
March 26th, 12:06 pm
రక్షణ మరియు సాంకేతికత నుండి ప్రపంచ వాణిజ్యం మరియు దౌత్యం వరకు వివిధ రంగాలలో భారతదేశం సంచలనం సృష్టిస్తోంది. ఈ వారం, దేశం తన నావికా శక్తిని బలోపేతం చేసింది, భవిష్యత్ రవాణాను స్వీకరిస్తోంది మరియు ప్రపంచ భాగస్వాములతో ఆర్థిక సంబంధాలను ఏర్పరుచుకుంది.‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి
March 17th, 10:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్
March 17th, 10:26 pm
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. గురుద్వారా సందర్శనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శ్రీ మోదీ షేర్ చేస్తూ సేవ అన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడం అన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచమంతటా ప్రశంసాపాత్రమవుతోందన్నారు.