'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన
May 17th, 03:45 am
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్ జెటెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.చోళ తామ్ర పత్రాలు భారత్‌కు అప్పగింత
May 16th, 10:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ రాబ్ జెట్టెన్‌ల సమక్షంలో ఈ రోజు 11వ శతాబ్దపు చోళుల తామ్ర పత్రాలను లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం భారత ప్రభుత్వానికి అప్పగించింది.