న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 11:09 pm
శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్ గారికి, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం
October 17th, 08:00 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 27th, 11:45 am
ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 27th, 11:30 am
ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.ఢిల్లీలోని యశోభూమి వేదికగా జరిగిన సెమీకాన్ ఇండియా-2025 సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 02nd, 10:40 am
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారు, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు, ఎస్ఈఎమ్ఐ అధ్యక్షులు అజిత్ మనోచా గారు, దేశవిదేశాల నుంచి వచ్చిన సెమీ కండక్టర్ పరిశ్రమకు చెందిన సీఈవోలు, వారి సహచరులు, వివిధ దేశాల నుంచి హాజరైన మా అతిథులు, అంకురసంస్థలతో అనుబంధంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నా యువ విద్యార్థి మిత్రులు, సోదరసోదరీమణులారా!‘సెమీకాన్ ఇండియా 2025’ను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. భారత్‌పై ప్రపంచానికి నమ్మకముంది..
September 02nd, 10:15 am
‘సెమీకాన్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... దేశ విదేశాల నుంచి సెమీకండక్టర్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వారి సహచరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అతిథులు, అంకుర సంస్థలతో అనుబంధం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ విద్యార్థులకు కూడా ఆయన స్వాగతం పలికారు.