సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి
September 24th, 06:33 pm
సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి భేటీ
August 31st, 04:50 pm
టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ శాంతిభద్రతల కమిషన్ చైర్మన్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.టియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
August 31st, 11:06 am
మీ ఆత్మీయ స్వాగతానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతేడాది కజన్‌లో మన చర్చలు ఇరుదేశాల సంబంధాలకు సానుకూల దిశానిర్దేశం చేశాయి. సరిహద్దు వద్ద శాంతి, స్థిరత్వం నెలకొన్నాయి. సరిహద్దు నిర్వహణ పట్ల ఇరుదేశాల ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారు. కైలాస్ మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలు కూడా ప్రారంభంకానున్నాయి. ఇరుదేశాల మధ్య సహకారం 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం
August 31st, 11:00 am
టియాంజిన్‌లో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.చైనాలోని టియాంజిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
August 30th, 04:00 pm
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం చైనా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకానున్నారు. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అధ్యక్షుడు పుతిన్ మరియు ఇతర నాయకులను కలుస్తారు.జపాన్, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ప్రకటన
August 28th, 08:40 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళుతున్నాను.జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన
August 22nd, 06:15 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ
August 19th, 07:34 pm
కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఏఎస్పిఐ యొక్క క్రిటికల్ టెక్నాలజీ ట్రాకర్‌లో మొదటి ఐదు దేశాలలో భారతదేశం స్థానం సంపాదించిందని ప్రశంసించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
October 03rd, 07:35 pm
ఏఎస్పిఐ క్రిటికల్ టెక్నాలజీ ట్రాకర్ ప్రకారం 64 టెక్నాలజీలలో 45 విషయానికి వస్తే భారతదేశం ఇప్పుడు మొదటి ఐదు దేశాలలో ఒకటిగా ఉంది. శాస్త్రీయ మరియు పరిశోధన పురోగతుల కోసం రేసు మరియు ప్రపంచ ప్రతిభను నిలుపుకునే సామర్థ్యంతో సహా క్లిష్టమైన సాంకేతికతల అభివృద్ధిని అధ్యయనం ట్రాక్ చేస్తుంది. ఈ అధ్యయనం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతికతల అభివృద్ధి మరియు నియంత్రణను ఆధారం చేసే కీలకమైన పదార్ధాలను డాక్యుమెంట్ చేస్తుంది మరియు అది ఒక దేశం యొక్క ఆర్థిక పరాక్రమాన్ని ఎలా కొలుస్తుంది.ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పాల్గొన్న భారతదేశ క్రీడాకారుల దళం తో నవంబర్ 1 వ తేదీ న సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
October 31st, 05:04 pm
ఏశియాన్ పారా గేమ్స్ లో పాల్గొన్న భారతదేశాని కి చెందిన క్రీడాకారుల మరియు క్రీడాకారిణుల దళం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబర్ 1 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 4 గంటల 30 నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఆసియా పారాగేమ్స్ భారత క్రీడాకారుల అసమాన ప్రతిభా ప్రదర్శనపై ప్రధాని ప్రశంసలు
October 28th, 11:13 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌లో అసమాన ప్రతిభా ప్రదర్శనతో 111 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. అకుంఠిత పరిశ్రమ, మొక్కవోని సంకల్పంతో విజయాలు సాధించడం ద్వారా వారు దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’లో కాంస్య విజేత కిషన్ గంగూలీకి ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:48 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం సాధించిన కిషన్ గంగూలీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి1’లో కాంస్య పతక విజేతలు హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు ప్రధాని అభినందన
October 28th, 08:45 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి2’లో కాంస్యం విజేతలు కిషన్ గంగూలీ.. ఆర్యన్ జోషి.. సోమేంద్రలకు ప్రధాని అభినందన
October 28th, 08:44 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-2’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం దక్కించుకున్న కిషన్ గంగూలీ, ఆర్యన్ జోషి, సోమేంద్రలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’లో కాంస్యం విజేత అశ్విన్ మక్వానాను అభినందించిన ప్రధానమంత్రి
October 28th, 08:38 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్యం సాధించిన అశ్విన్ మక్వానాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీ. టి-20’ విభాగంలో కాంస్యం సాధించిన పూజకు ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:35 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీటర్ల టి-20’ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయంలో ఆమె చూపిన ప్రతిభ, పట్టుదలను ఆయన ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ ‘జావెలిన్ త్రో ఎఫ్-55’ విభాగంలో కాంస్యం గెలిచిన టేక్‌చంద్ మహ్లావత్‌కు ప్రధాని అభినందన
October 28th, 08:32 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల జావెలెన్ త్రో ఎఫ్-55 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న టేక్‌చంద్ మహ్లావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. మహ్లావత్ ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం సంకల్ప బలానికి, శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, తద్వారా అతడు దేశం గర్వించే విజయం సాధించాడని వ్యాఖ్యానించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం’లో స్వర్ణం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 11:50 am
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల విశేష ప్రతిభకు అతని విజయం తార్కాణమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.