ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం
December 17th, 12:25 pm
పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని
December 17th, 12:12 pm
భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.అనువాదం: అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
November 28th, 10:15 am
ప్రధానమంత్రి: అది అంతే... మీ అందరినీ నేను పట్టించుకుంటాను.మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 28th, 10:00 am
మహిళల అంధుల టీట్వంటీ ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్, 7లో సంభాషించారు. క్రీడాకారిణులతో ఆత్మీయంగా ముచ్చటించిన శ్రీ మోదీ.. వారి దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో, సవాళ్లను ఎదుర్కొనే తత్వంతో ప్రయాణం కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. క్రీడా మైదానంలోనే కాకుండా జీవితంలోనూ కష్టపడి పని చేసేవారు ఎప్పుడూ విఫలం కారన్నారు. క్రీడాకారిణులు తమదైన ప్రత్యేక గుర్తింపును రూపొందించుకున్నారని, అది వారి ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసిందన్నారు.గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 15th, 03:15 pm
గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 03:00 pm
ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.నవ రాయ్‌పూర్‌లోని సత్యసాయి సంజీవని పిల్లల గుండెజబ్బు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న బాలలతో ప్రధానమంత్రి మాటామంతీ
November 01st, 05:30 pm
సర్... నేను హాకీ ఛాంపియన్‌ని. ఇప్పటిదాకా 5 పతకాలు సాధించాను. మా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించినపుడు నా గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధరించారు. ఆ తర్వాత ఈ ఆస్పత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నాను. నేనిప్పుడు మళ్లీ హాకీ మైదానంలో ప్రతిభ చూపగలను.పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులను జయించిన పిల్లలతో ప్రధానమంత్రి ముఖాముఖి
November 01st, 05:15 pm
'దిల్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో జరిగిన ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుల నుంచి విజయవంతంగా కోలుకున్న 2500 మంది పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు.నవంబరు 1న ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
October 31st, 12:02 pm
ఉదయం సుమారు 10 గంటల వేళకు, ఆయన ‘దిల్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా 2500 మంది చిన్నారులతో భేటీ అవుతారు. వారందరికీ పుట్టుకతో వచ్చిన గుండె జబ్బును చికిత్స చేసిన నేపథ్యంలో, నవా రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో ‘జీవన దానం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన
September 16th, 02:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.డెహ్రాడూన్‌లో ప్రధాని పర్యటన.. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం అంచనాపై సమీక్ష సమావేశం
September 11th, 06:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్‌ను సందర్శించి.. ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే
September 09th, 05:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 9న పంజాబ్ చేరుకుని… వరద పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు.‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు
August 31st, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.పత్తి దిగుబడిపై చర్చ కోసం ఉన్నత స్థాయి సమావేశాన్ని
July 09th, 07:55 pm
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈనెల 11న కోయంబత్తూరులో పత్తి దిగుబడి అంశంపై కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు. భారత రైతు సోదరసోదరీమణులంతా పత్తి దిగుబడి పెంపు గురించి సూచనలు ఇవ్వాలని ఆయన ఆహ్వానించారు.అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి
April 21st, 08:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.బవలియాలీ ధామ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 20th, 04:35 pm
ముందుగా, భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, గౌరవనీయులైన సాధువులు, మహంతులకు, ఈ పవిత్ర సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ రోజు మన ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సారి నిర్వహించిన మహాకుంభ్ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, మనందరికీ గర్వకారణంగా నిలిచింది. ఎందుకంటే ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగానే మహంత్ శ్రీ రామ్ బాపూజీని మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించుకున్నాం. ఇది మనందరికీ అమితానందనాన్ని కలిగిస్తోంది. రామ్ బాపూజీకి, మన సమాజానికి చెందిన అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.బవళియాళి ధామ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 20th, 04:30 pm
గుజరాత్‌లోని భర్వాడ్ సమాజ బవలియాళి ధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సందేశమిచ్చారు. ముందుగా మహంత్ శ్రీరామ్ బాపూజీ, సమాజ నాయకులు, కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తజనానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, వాటిని కొనసాగించడంలో జీవితం అంకితం చేసిన గౌరవనీయ సాధువులు, మహంతులకు గౌరవ నివాళి అర్పించారు. చారిత్రక మహాకుంభ్‌తో ముడిపడిన అమితానందం, ప్రతిష్టను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా మహంత్ శ్రీరామ్ బాపూజీకి ‘మహామండలేశ్వర్’ బిరుదు ప్రదానాన్ని ఓ కీలక ఘట్టంగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఇదొక చిరస్మరణీయ ఘనత మాత్రమేగాక అందరికీ అమితానందం కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. మహంత్ శ్రీరామ్ బాపూజీతోపాటు భర్వాడ్ సమాజంలోని కుటుంబాల సేవను, వారి విజయాలను స్మరించుకుంటున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.బేటీ బచావో, బేటీ పఢావో ఉద్యమానికి పదేళ్లు.. ప్రస్తావించిన ప్రధానమంత్రి
January 22nd, 10:04 am
‘బేటీ బచావో, బేటీ పఢావో’ (ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి) ఉద్యమానికి నేటితో పది సంవత్సరాలు పూర్తి అయిన సంగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమం చెప్పుకోదగ్గ మార్పులకు దారితీసిందని, ప్రజల అండదండలే దీనిని ముందుకు నడిపిస్తున్నాయని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని ప్రధాని అన్నారు. బాలురు, బాలికల విషయంలో పక్షపాత భావనను దూరం చేయడంలో, బాలికలకు సాధికారతను కల్పించడంలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమం తోడ్పడిందని ఆయన ప్రధానంగా చెప్పారు. బాల బాలికల నిష్పత్తి తక్కువ స్థాయిల్లో ఉంటూ వస్తున్న జిల్లాల్లో ఈ ఉద్యమం అమలుతో గణనీయ ఫలితాలు వచ్చాయని కూడా శ్రీ మోదీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని చక్కగా కొనసాగించడంలో పాలుపంచుకొంటున్న ఆసక్తిదారులందరినీ ఆయన అభినందించారు.వారణాసిలో ఆర్‌జె శంకర కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 02:21 pm
కంచి కామకోటి పీఠం శంకరాచార్య పూజ్యశ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్; శంకర నేత్ర నిధి ప్రతినిధి శ్రీ ఆర్.వి.రమణి, ఇతర ప్రముఖులు డాక్టర్ శ్రీ ఎస్.వి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మురళీ కృష్ణమూర్తి, శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా, సంస్థ విశిష్ట సభ్యులు, గౌరవనీయ సోదరసోదరీమణులారా!ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 20th, 02:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి వివిధ కంటి సమస్యలకు సమగ్ర సలహాలు , చికిత్సలను అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ సందర్శించారు.