మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం శక్తి జిల్లాలోని విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం.. ప్రధానమంత్రి తీవ్ర సంతాపం నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

April 14th, 10:06 pm

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఓ విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రితో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భేటీ

April 07th, 02:07 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

March 29th, 11:30 am

ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

‘పరీక్షా పే చర్చ 2026’ రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాం విద్యార్థులతో తన సంభాషణ వివరాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 10th, 05:06 pm

తొమ్మిదో సంచిక ‘పరీక్షా పే చర్చ (పీపీసీ)-2026’లో విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. పీపీసీ-2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాంలకు చెందిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ, ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించామని శ్రీ మోదీ చెప్పారు.

బస్తర్ పాండుమ్ వేడుకల సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

February 10th, 10:42 am

ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ప్రత్యేక వేడుక బస్తర్ పాండమ్ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బస్తర్ సంస్కృతి, సంప్రదాయాలను, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో, స్థానిక సంఘాలను బలోపేతం చేయటంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అనువాదం: ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమం 2వ ఎపిసోడ్‌లో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ

February 09th, 10:30 am

ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.

పరీక్షా పే చర్చ- 2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి విద్యార్థులతో సంభాషించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

February 09th, 10:00 am

తొమ్మిదో ఎడిషన్ పరీక్షా పే చర్చ (పీపీసీ)- 2026 కొనసాగింపులో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థులతో సంభాషించారు. పీపీసీ- 2026 రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి నగరాలకు చెందిన పరీక్షా యోధులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. పరీక్షా పే చర్చ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ.. ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. కోయంబత్తూరు ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. తమిళనాడు విద్యార్థుల ఉత్తేజమూ, ఉత్సుకతా తనను ముగ్ధుడిని చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వణక్కం’ అని అభివాదం చేస్తూ సరదాగా వారితో ముచ్చటించారు. ప్రధానమంత్రిని చూసినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎంతో ఆర్భాటంగా, నాటకీయంగా వస్తారనుకున్నామనీ.. కానీ ఆయన చాలా సాధారణంగా, నిరాడంబరంగా, మనలో ఒకరిగా కనిపించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి రాక తమలో ఉత్తేజం నింపిందని ఒక విద్యార్థి చెప్పారు.

రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి అధ్యక్షతన 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్‌ జనరళ్లు.. ఇన్స్‌పెక్టర్‌ జనరళ్ల సదస్సు

November 30th, 05:17 pm

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 60వ అఖిల భారత పోలీసు డైరెక్టర్‌ జనరళ్లు-ఇన్స్పెక్టర్‌ జనరళ్ల సదస్సుకు ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ‘వికసిత భారత్‌: భద్రత ప్రమాణాలు’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సులో చివరి (3వ) రోజున ఆయన ప్రసంగిస్తూ- పోలీసులపై ప్రజాభిప్రాయంలో... ముఖ్యంగా యువతరంలో మార్పు తేవాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు. ఈ మేరకు వృత్తిగత నైపుణ్యంతోపాటు సామాజిక సున్నితత్వం, ప్రతిస్పందనాత్మకత వంటి లక్షణాలను పెంపొందించకోవడం అవశ్యమని పేర్కొన్నారు. అలాగే, పట్టణ పోలీసింగ్‌ పటిష్ఠం కావాలని, పర్యాటక పోలీసింగ్‌లో పునరుజ్జీవం అవసరమని చెప్పారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

నవంబరు 29-30 తేదీల్లో రాయ్‌పూర్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్స్/ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ అఖిల భారత సదస్సులో పాల్గొననున్న ప్రధాని

November 27th, 12:45 pm

నవంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. పోలీసు శాఖకు సంబంధించి కీలక సవాళ్ళ పరిష్కారంలో ఇంతవరకు సాధించిన పురోగతిని సమీక్షించడం, ‘వికసిత్ భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ‘సురక్షిత భారత్’ నిర్మాణం కోసం ముందుచూపుతో కూడిన ప్రణాళికను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

అనువాదం: ఢిల్లీలో జరిగిన ఆరో విడత రామ్‌నాథ్ గోయెంకా ఉపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 17th, 08:30 pm

భారత ప్రజాస్వామ్యంలో జర్నలిజం, భావ వ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తిని గౌరవించేందుకు ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దార్శనికుడిగా, సంస్థలను నిర్మించే వ్యక్తిగా, దేశభక్తుడిగా, మీడియా నాయకుడిగా ఉన్న రామ్‌నాథ్ గారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం ఒక వార్తాపత్రికగానే కాకుండా భారత ప్రజలకు సంబంధించిన ఒక యజ్ఞంగా స్థాపించారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ.. భారత ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాలకు గొంతుకగా మారింది. ఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. రామ్‌నాథ్ గోయెంకా గారి నిబద్ధత, ఆయన చేసిన కృషి, ఆయన దార్శనికత మనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఈ ఉపన్యాసానికి నన్ను ఆహ్వానించినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విషయంలో మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను.

రామ్‌నాథ్ గోయెంకా 6వ ఉపన్యాసం ఇచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 17th, 08:15 pm

ఇవాళ న్యూఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక ‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… రామ్‌నాథ్ గోయెంకా ఆరో ఉపన్యాసాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం, జర్నలిజం, భావవ్యక్తీకరణ, ప్రజా ఉద్యమాల శక్తిని పెంచిన మహోన్నత వ్యక్తిని గౌరవించడంలో భాగంగా మనమంతా ఇక్కడ సమావేశమైనట్లు తెలిపారు. రామ్‌నాథ్ గోయెంకా.. దార్శనికత కలిగిన వ్యక్తి, సంస్థ స్థాపకుడు, జాతీయవాది, మీడియా నాయకుడని ప్రధానమంత్రి కొనియాడారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం వార్తాపత్రికగా కాకుండా భారత ప్రజల కోసం ఒక యజ్ఞంలా ప్రారంభించారన్నారు. రామ్‌నాథ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల గొంతుకగా ఈ సంస్థ మారిందని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, రామ్‌నాథ్ గోయెంకా నిబద్ధత, కృషి, దార్శనికత స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఉపన్యాసం ఇచ్చేందుకు తనను ఆహ్వానించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు ధన్యవాదాలు చెప్పిన ప్రధానమంత్రి.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దినోత్స‌వం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 15th, 03:15 pm

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 03:00 pm

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.

అనువాదం: నయా రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ రజతోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 01st, 03:30 pm

గౌరవనీయులైన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా గారు, ప్రజాదరణ గల చైతన్యవంతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సీనియర్ సహచరులు జువల్ ఓరం గారు, దుర్గా దాస్ ఉయ్కే గారు, తోఖాన్ సాహు గారు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్ గారు.. ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో గారు, విజయ్ శర్మ జీ.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా…

ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

November 01st, 03:26 pm

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నేడు నవ రాయ్‌పూర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 01st, 01:30 pm

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్‌ డేకా, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాష్ట్ర శాసనసభ స్పీకర్- నా మిత్రుడు శ్రీ రమణ్ సింగ్‌, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండ‌లిలో నా సహ‌చ‌రుడు శ్రీ తోఖన్ సాహు, ఉప ముఖ్యమంత్రులు- శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సావు, శాస‌న‌స‌భ‌లో ప్రతిపక్ష నేత శ్రీ చరణ్ దాస్ మహంత్‌, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్య‌క్ర‌మానికి హాజరైన సోద‌రీసోదరులారా!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 01st, 01:00 pm

ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక స్వర్ణారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా చాలా సంతోషకరమైన రోజు ఇదన్న ఆయన.. దశాబ్దాలుగా పెంచి పోషించిన ఈ ప్రాంతంతో ఉన్న లోతైన భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తగా ఉన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. రాష్ట్రంలో చాలా సమయం గడిపినట్లు, తద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న దార్శనికత, రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న సంకల్పం, అది నెరవేరటం వంటి ప్రతి క్షణానికి సాక్షిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరివర్తనలోని ప్రతి క్షణాన్ని ఆయన గుర్తుచేశారు. 25 ఏళ్లు అనే ప్రధాన ఘట్టానికి రాష్ట్రం చేరుకున్న వేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞత భావంతో ఉన్నట్లు వ్యక్తం చేశారు. రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు.

నవ రాయపూర్ లో బ్రహ్మకుమారీల ధ్యాన కేంద్రం - శాంతి శిఖర్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 01st, 11:15 am

ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ రామన్ డేకా, ప్రజాదరణ పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, రాజయోగిని సిస్టర్ జయంతి, రాజయోగి మృతుంజయ్, సోదరి బ్రహ్మకుమారీలు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, ప్రముఖులారా!

ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో 'శాంతిశిఖర్'- ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవంలో బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

November 01st, 11:00 am

ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో ఆధునిక ఆధ్యాత్మిక జ్ఞాన, శాంతి-ధ్యాన కేంద్రం “శాంతిశిఖర్‌”ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 25 సంవత్సరాలు పూర్తయినందున ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదే రోజున తమ 25వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఇదే రోజున ఆవిర్భవించిన దేశంలోని పలు రాష్ట్రాలు వేడుకలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్రాల ప్రగతి దేశ పురోగమనాన్ని వేగిరం చేస్తుందన్న మార్గదర్శక సూత్రం ప్రాతిపదికగా వికసిత భారత్‌ లక్ష్య సాధనకు మేం చురుగ్గా కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.