రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్‌కు ప్రధానమంత్రి నివాళులు
June 26th, 12:46 pm
రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.