
లండన్‌లో వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్.. బ్లిట్జ్ సెమీ ఫైనల్‌లో దివ్యా దేశ్‌ముఖ్ అద్భుత విజయం.. ప్రధానమంత్రి అభినందనలు
June 19th, 02:00 pm
లండన్‌లో నిర్వహించిన వరల్డ్ టీమ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్లిట్జ్ సెమీ ఫైనల్ రెండో దశలో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి హోవు యిఫాన్‌పై చారిత్రక గెలుపును సాధించినందుకు దివ్యా దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
నార్వే చెస్ 2025లో మాగ్నస్ కార్ల్‌సెన్ పై తొలిసారిగా విజయం సాధించిన గుకేశ్ ను అభినందించిన ప్రధానమంత్రి
June 02nd, 08:23 pm
తొలిసారిగా మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు చెస్ ఆటగాడు గుకేశ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నార్వే చెస్ 2025 రౌండ్ 6లో మాగ్నస్ కార్ల్‌సెన్ పై గుకేశ్ గెలిచాడు.
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 28th, 09:36 pm
నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం
January 28th, 09:02 pm
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.ప్రధానమంత్రితో చెస్ చాంపియన్ కోనేరు హంపి భేటీ
January 03rd, 08:42 pm
చదరంగ క్రీడలో విజేత కోనేరు హంపి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప గర్వకారణంగా నిలిచినందుకు కోనేరు హంపిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఆమె పదునైన మేధస్సు, అచంచల దృఢనిశ్చయం తేటతెల్లం అయ్యాయన్నారు.ఫిడే ఉమెన్స్ వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ షిప్ విజయంపై కోనేరు హంపికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు
December 29th, 03:34 pm
ఫిడే ఉమెన్స్ వరల్డ్ రాపిడ్ చాంపియన్ షిప్-2024 లో విజయం సాధించిన కోనేరు హంపికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె స్థైర్యం, చాతుర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రశంసించారు.ప్రధానమంత్రిని కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్. డి
December 28th, 06:34 pm
చెస్ ఛాంపియన్ గుకేశ్. డి ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. గుకేశ్ దృఢ సంకల్పం, అంకితభావాలను శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు.ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయస్కుడు గుకేష్ డీ ని అభినందించిన ప్రధానమంత్రి
December 12th, 07:35 pm
అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ డీ ని నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ గెలుపు అసాధారణమైన చారిత్రక విజయమని పేర్కొన్నారు.లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటిన అర్జున్ ఎరిగైసికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన
October 27th, 11:08 am
లైవ్ చెస్ రేటింగ్స్ లో 2800 మార్కును దాటినందుకు భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ కేటగిరీలో, మహిళల కేటగిరీలో స్వర్ణ పతకాలను
September 23rd, 01:15 am
45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలను గెలిచిన క్రీడాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పురుషుల, మహిళల చదరంగం టీమ్ లను ఆయన అభినందించారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాన మంత్రి సంభాషణ
January 23rd, 06:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బిపి) అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ప్రధాన మంత్రి ప్రతి అవార్డు గ్రహీతకు స్మారక చిహ్నాలను అందించి, ఆపై వారితో ఫ్రీవీలింగ్ ఇంటరాక్షన్- ఇష్టాగోష్ఠిలో నిమగ్నమయ్యారు. అవార్డుకు ఎంపికైనందుకు పిల్లలు తమ విజయాల వివరాలను పంచుకున్నారు. సంగీతం, సంస్కృతి, సౌరశక్తి, బ్యాడ్మింటన్, చెస్ వంటి వివిధ విషయాలపై చర్చించారు.తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 06:33 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
January 19th, 06:06 pm
తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.మన్ కి బాత్, డిసెంబర్ 2023
December 31st, 11:30 am
మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.ఎఫ్ఐడిఇ గ్రాండ్ స్విస్ ఓపెన్ లో అగ్ర స్థానాన్నిచేజిక్కించుకొన్న భారతదేశం
November 06th, 08:23 pm
ఎఫ్ఐడిఇ (‘ఫిడే’) గ్రాండ్ స్విస్ ఓపెన్ లో శ్రీ విదిత్ గుజరాతీ మరియు వైశాలీ గారు లు సాధించిన అసాధారణమైన గెలుపుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి ని ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’లో కాంస్య విజేత కిషన్ గంగూలీకి ప్రధానమంత్రి అభినందనలు
October 28th, 08:48 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి-2’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం సాధించిన కిషన్ గంగూలీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ ‘చదరంగం బి1’లో కాంస్య పతక విజేతలు హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు ప్రధాని అభినందన
October 28th, 08:45 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి2’లో కాంస్యం విజేతలు కిషన్ గంగూలీ.. ఆర్యన్ జోషి.. సోమేంద్రలకు ప్రధాని అభినందన
October 28th, 08:44 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-2’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం దక్కించుకున్న కిషన్ గంగూలీ, ఆర్యన్ జోషి, సోమేంద్రలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’లో కాంస్యం విజేత అశ్విన్ మక్వానాను అభినందించిన ప్రధానమంత్రి
October 28th, 08:38 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్యం సాధించిన అశ్విన్ మక్వానాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.